మళ్లీ ఆ హాట్ అవతారంలో నయన్

Update: 2016-02-22 07:30 GMT
కెరీర్ ఆరంభంలో చాలా పద్ధతిగా కనిపించింది నయనతార. కానీ మధ్యలోకి వచ్చేసరికి రెచ్చిపోయింది. ఎక్స్ పోజింగ్ కు ఏమాత్రం అడ్డు చెప్పకుండా రెచ్చిపోయింది. క్లీవేజ్ షోలు చేసింది. బికినీల్లోనూ అందాలు ఆరబోసింది. తనే ఏమైనా కట్టుబాట్లు పెట్టుకుందో లేక క్యారెక్టర్లు డిమాండ్ చేయట్లేదో ఏమో గానీ.. గత మూణ్నాలుగేళ్లుగా మాత్రం నయన్ పద్ధతిగా కనిపిస్తోంది. ఐతే ఇప్పుడు మళ్లీ ఇప్పుడు గ్లామర్ గేట్లు తెరిచేయడానికి రెడీ అవుతోంది ఈ మలయాళ కుట్టి. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఇరు ముగమ్’లో నయన్ మళ్లీ బికినీ అందాలతో కనువిందు చేయబోతోంది.

నయన్ ఇంతకుముందు ‘బిల్లా’ సినిమాలో బికినీలో కనిపించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె బికినీ అందాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఐతే క్యారెక్టర్ డిమాండ్ చేయడం వల్లే మళ్లీ బికినీలో కనిపించడానికి  అంగీకరించిందట నయన్. విక్రమ్ ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ఇందుకోసం భారీగా గడ్డం కూడా పెంచాడు. తెలుగులోకి ‘డైనమైట్’గా రీమేక్ అయిన ‘అరిమా నంబి’తో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి డైరెక్టర్. నిత్యామీనన్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. విక్రమ్-నయన్ జంటగా నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. విక్రమ్ కొన్నేళ్లుగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్నాడు. నయన్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆమె అదృష్టం విక్రమ్ కు కూడా అంటుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News