సెక్సీ లేడి నయనతార తమిళంలో ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్. టాప్ హీరోలు ఆమెను తీసుకోకపోవచ్చు కాని.. చిన్న చిన్న హీరోలకు మాత్రం ఆవిడే దేవత. ఎందుకంటే ఆమె అడుగుపెట్టిన సినిమాలన్నీ కూడా హిట్లే అవుతున్నాయి ఈ మధ్యన. అయితే ఇప్పుడు తెలుగులో మాత్రం నయనతారకు మళ్ళీ ప్రూవ్ చేసుకునే తరుణం వచ్చింది. కాని.. అక్కడే చిక్కొచ్చింది.
ఇప్పటివరకు ఈమె ఇచ్చిన డేట్లన్నీ వాడేసుకోవడంతో.. ఇప్పుడు ''బాబు బంగారం'' సినిమా కోసం మరిన్ని డేట్లు ఎడ్జస్ట్ చేసుకోలేకపోతోందట నయన. కాని దర్శకుడు మారుతి మాత్రం మరో 10 రోజులు ఈమె కాల్ షీట్లు కావాలని అడిగినట్లు తెలుస్తోంది. తమిళంలో ఫుల్ బిజీగా ఉండటంతో ఇప్పుడు ఆ పది రోజుల డేట్లు ఇవ్వలేకపోతోందట. కాని ఆమె డేట్లు ఇవ్వకపోతే ఇక్కడ సినిమా పూర్తవ్వదు. మనోళ్ళు ఆల్రెడీ జూలై 29న రిలీజ్ చేద్దామని అనుకుంటుంటే.. ఇప్పడు నయన డేట్లు లేకపోవడం అనేది రిలీజ్ మీద గాట్టిగా ప్రభావం చూపించే ఛాన్సుంది.
మారుతి డైరక్షన్ లో రూపొందుతున్న ''బాబు బంగారం'' సినిమాలో హీరో వెంకటేష్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందించాడు.