ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందని నయన్ హింట్ ఇస్తోందా..?

Update: 2021-03-25 06:48 GMT
కోలీవుడ్ హాట్ క‌పుల్ న‌య‌న తార‌ - విఘ్నేష్ శివ‌న్ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా? ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విఘ్నేష్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటో ఈ వార్తలు నిజమే అనుకునేలా చేస్తున్నాయి. నయన్ ని కౌగిలించుకుని ఉన్న ఓ ఫోటోని పోస్ట్ చేసిన విగ్నేష్.. లవ్ సింబల్స్ తో జీవితానికి వేలికి ముడిపెడుతూ ఓ తమిళ్ కొటేషన్ పెట్టాడు. అంతేకాకుండా ఈ ఫొటోలో వాళ్లిద్దరీ ముఖాలు కనిపించకుండా కేవలం నయన్ చేతికి ఉన్న ఉంగరం హైలైట్ అయ్యేలా ఈ పోస్ట్ ఉంది. దీంతో మా ఇద్దరి ఎంగేజ్మెంట్ జరిగిందని ఈ పోస్ట్ ద్వారా అందరికీ తెలియాలని హింట్ ఇస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, నయన్ - విఘ్నేష్ జంట గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. 'నానమ్ రౌడీ ధాన్' సినిమా సమయంలో వీరిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయిందని టాక్. అయితే ఎప్పుడు కూడా వీరిద్దరూ తమ బంధాన్ని దాచడానికి ప్రయత్నించలేదు. వీలు దొరికినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ.. రొమాంటిక్ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హల్ చల్ చేస్తుంటారు. కానీ పెళ్లి విషయంలో మాత్రం ఈ క్రేజీ కపుల్ ఇంతవరకు నోరు విప్పలేదు. అయితే ఇప్పుడు విగ్నేష్ పోస్ట్ చేసిన ఫోటోని చూసి ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగిపోయిందని ఫిక్స్ అయ్యారు. రెండు సార్లు ప్రేమ‌లో విఫ‌ల‌మైన న‌య‌న్.. ముచ్చ‌ట‌గా మూడోసారి సాగిస్తున్న ఈ ప్రేమాయణం త్వరగా పెళ్లి పీటల వరకు వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
    

Tags:    

Similar News