మాజీ లవర్స్ మీట్ ఎలా జరిగిందంటే

Update: 2016-12-31 06:16 GMT
ప్రభుదేవా-నయనతార కొన్నేళ్ల క్రితం వీళ్లిద్దరూ తెగ ప్రేమించేసుకున్నారు. అమర ప్రేమికుల రేంజ్ లో కలిసి చక్కర్లు కొట్టేశారు. నయన్ ను చేసుకునేందుకు తన భార్యకు ప్రభుదేవా విడాకులు ఇస్తే.. ఈయన కోసం నయనతార హిందూ మతం స్వీకరించింది. అలాంటి ఈ జంట హఠాత్తుగా దూరమైపోయారు. ఎవరికి వారే అనేసుకుని.. ఎవరి లైఫ్ లో.. ఎవరి కెరీర్ లో వాళ్లు ముందుకెళిపోతున్నారు.

అదంతా ఓకే గానీ.. రీసెంట్ గా ప్రభుదేవా నయనతారల భేటీ ఒకటి జరిగింది. అనుకోకుండానే అయినా.. ఓ స్టార్ హోటల్ లో వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. తమ దారి తాము చూసుకున్న మాజీ లవర్స్ గా మొహం తిప్పుకుని వెళ్లిపోతారని అంతా అనుకుంటే.. నవ్వుతూ పలకరించుకుని.. కూర్చుని చాలాసేపు మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు వీళ్ల భేటీ ఆంతర్యం ఏంటో అంతు పట్టక జుట్టుపీక్కోవాల్సి వచ్చిందట.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార పెళ్లి అయిపోయిందని కోలీవుడ్ కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి సంగతి పైకి చెప్పకపోయినా.. ఇండస్ట్రీ జనాలకు అందరికీ ఆ సంగతి తెలుసట. విఘ్నేష్ తో మ్యారేజ్ విషయంలో కంగ్రాట్స్ చెప్పాడట ప్రభుదేవా. అలాగే కెరీర్ లో దూసుకుపోతున్నందుకు అభినందించాడట ఈ నయన్ మాజీ లవర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News