కుర్ర హీరోతో లేడీ సూపర్‌ స్టార్‌.. ఇదేం కాంబో భయ్యా!

Update: 2023-03-26 18:00 GMT
లేడీ సూపర్ స్టార్‌ నయనతార సీనియర్ హీరోలకు జోడీగా అయితే సెట్‌ అవుతుంది.. కానీ కొత్త హీరోలకు ఈమధ్య ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్స్ కు సెట్‌ అవ్వడం కష్టమే కదా.. అయితే త్వరలో ఈమె ఇటీవల ఇండస్ట్రీలో అడుగు పెట్టి తెగ సందడి చేస్తున్న కుర్ర స్టార్‌ ప్రదీప్ రంగనాథన్‌ తో కలిసి నటించబోతుంది.

పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ వరుసగా సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ నయనతార ఇటీవల తన భర్త విఘ్నేష్ శివన్‌ దర్శకత్వంలో ప్రదీప్‌ రంగనాథన్‌ తో కలిసి నటించేందుకు ఓకే చెప్పింది. వీరిద్దరి కాంబోలో సినిమా ఏంటో అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండవని తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ఒక సినిమాను చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

దాంతో విఘ్నేష్‌ వెంటనే కొత్త సినిమాను షురూ చేసేందుకు రెడీ అయ్యాడు. ఒక విభిన్నమైన కథ తో ప్రదీప్‌ రంగనాథన్‌ తో విఘ్నేష్ శివన్ సినిమాను చేసేందుకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నాడు.

మరో రెండు వారాల్లో ఈ కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ సినిమాలో నయనతార మరియు ప్రదీప్‌ రంగనాథన్‌ పాత్రల మధ్య ఉండే సంబంధం చాలా విచిత్రంగా ఉంటుందని.. ఈ సరి కొత్త పాయింట్‌ ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేస్తుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

నయనతార రెగ్యులర్ కమర్షియల్‌ సినిమాలు కాకుండా కాస్త నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు.. కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలను చేసే ఉద్దేశ్యంతో ఇలాంటి పాత్రలను మరియు సినిమాలను చేస్తోంది. తన భార్య నయన్‌ తో గతంలో మంచి సినిమాలు చేసి సక్సెస్ అయిన విఘ్నేష్ మరో విజయాన్ని ఈ సినిమాతో తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News