తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో చాలామంది కొత్త కథానాయికలు వచ్చారు. కానీ ఆల్రెడీ ఇతర భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేసి .. హీరోయిన్ గా తన కెరియర్ ను మొదలుపెట్టేసిన పదేళ్లకు తెలుగు తెరకి వచ్చిన కథానాయికగా నజ్రియా కనిపిస్తుంది. తమిళ .. మలయాళ భాషల్లో ఎప్పుడో స్టార్ స్టేటస్ ను అందుకున్న నజ్రియా, ఇంతకాలానికి టాలీవుడ్ లో సినిమా చేయడానికి ఒప్పుకోవడం విశేషం. 'అంటే .. సుందరానికీ' సినిమాలో ఆమె నాని జోడీగా లీలా థామస్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నజ్రియా మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం .. ఇక్కడ ఇలా మాట్లాడాలంటే చాలా టెన్షన్ గా ఉంది. ముందుగా పవన్ కల్యాణ్ గారితో స్టార్ట్ చేస్తాను. ఆయన ఈ ఈవెంట్ కి రావడం .. బ్లెస్సింగ్స్ ఇవ్వడం నేను నమ్మలేకపోతున్నాను.
ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. నేను హైదరాబాదు థియేటర్లో ఫస్టు టైమ్ చూసిన సినిమా 'భీమ్లా నాయక్'. ఆ సినిమా చూస్తుంటే ఒక మేజిక్ లా అనిపించింది. పవన్ సార్ సినిమా వలన నాకు మంచి థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ లభించినట్టు అయింది.
ఇక సుకుమార్ గారి విషయానికి వస్తే, ఆయన గురించి నేను చాలా విన్నాను. ఫహాద్ ఆయన గురించి తరచూ చెబుతుంటారు. సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో .. ఆయనతో కలిసి పనిచేయడం వలన ఎంత హ్యాపీగా ఉంటుందనేది ఫహాద్ చెప్పేవారు.
అలాంటి సుకుమార్ గారిని ఈ రోజున ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను వర్క్ చేసినవారిలో నాని ఒక అమేజింగ్ యాక్టర్. ఆయనతో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభూతిని ... అనుభవాన్ని ఇచ్చింది. నటన పరంగా ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
వివేక్ ఆత్రేయ నన్ను ఈ సినిమాలో ఒక భాగం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్మి నాకు లీలా థామస్ పాత్రను ఇచ్చారు. ఆయన లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదేమో. ఈ సినిమాలో సీనియర్స్ తో కలిసి నటించే ఛాన్స్ దొరికింది. ఇప్పుడు అందరం ఒక ఫ్యామిలీ అయిపోయాము. ఈ సినిమా ద్వారా నన్ను పరిచయం చేస్తున్న నిర్మాతలకు .. అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు థియేటర్లో కలుసుకుందాం" అంటూ చెప్పుకొచ్చారు.Full View
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నజ్రియా మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం .. ఇక్కడ ఇలా మాట్లాడాలంటే చాలా టెన్షన్ గా ఉంది. ముందుగా పవన్ కల్యాణ్ గారితో స్టార్ట్ చేస్తాను. ఆయన ఈ ఈవెంట్ కి రావడం .. బ్లెస్సింగ్స్ ఇవ్వడం నేను నమ్మలేకపోతున్నాను.
ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. నేను హైదరాబాదు థియేటర్లో ఫస్టు టైమ్ చూసిన సినిమా 'భీమ్లా నాయక్'. ఆ సినిమా చూస్తుంటే ఒక మేజిక్ లా అనిపించింది. పవన్ సార్ సినిమా వలన నాకు మంచి థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ లభించినట్టు అయింది.
ఇక సుకుమార్ గారి విషయానికి వస్తే, ఆయన గురించి నేను చాలా విన్నాను. ఫహాద్ ఆయన గురించి తరచూ చెబుతుంటారు. సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో .. ఆయనతో కలిసి పనిచేయడం వలన ఎంత హ్యాపీగా ఉంటుందనేది ఫహాద్ చెప్పేవారు.
అలాంటి సుకుమార్ గారిని ఈ రోజున ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను వర్క్ చేసినవారిలో నాని ఒక అమేజింగ్ యాక్టర్. ఆయనతో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభూతిని ... అనుభవాన్ని ఇచ్చింది. నటన పరంగా ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
వివేక్ ఆత్రేయ నన్ను ఈ సినిమాలో ఒక భాగం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్మి నాకు లీలా థామస్ పాత్రను ఇచ్చారు. ఆయన లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదేమో. ఈ సినిమాలో సీనియర్స్ తో కలిసి నటించే ఛాన్స్ దొరికింది. ఇప్పుడు అందరం ఒక ఫ్యామిలీ అయిపోయాము. ఈ సినిమా ద్వారా నన్ను పరిచయం చేస్తున్న నిర్మాతలకు .. అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు థియేటర్లో కలుసుకుందాం" అంటూ చెప్పుకొచ్చారు.