#NBK 108 లాంచింగ్ కౌండ్ డౌన్ స్టార్ట్!

Update: 2022-12-07 09:50 GMT
#ఎన్బీకే 108 ప్రారంభోత్స‌వానికి ముహుర్తం కుదిరింది.  న‌టసింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న 108వ చిత్రం డిసెంబ‌ర్ 8న ఉద‌యం 9.30 గంట‌ల‌కు   హైద‌రాబాద్ లో లాంఛ‌నంగా  ప్రారంభం అవుతుంది. ఈ వేడుకలో బాల‌య్య తోపాటు ఇత‌ర తారాగ‌ణ‌మంతా పాల్గొనే అవ‌కాశం ఉంది. అలాగే సినీ..రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యే ఛాన్స్   ఉంది.

ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి బాల‌య్య  అత‌ని అభిమానులు కొన్ని నెల‌లుగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఆ స‌మ‌యం రానే వ‌చ్చేసింది. దీంతో అభిమానులు రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. ఓవైపు సంక్రాంతి కానుక‌గా 'వీర‌సింహారెడ్డి'గా ర‌చ్చ చేయ‌డానికి రెడీ అవుతోన్న బాల‌య్య  ఇంత‌లోనే 108వ సినిమాకి కూడా ముహూర్తం ఫిక్స్ చేయ‌డంతో అభిమానుల్లో రెట్టింపు ఆనందం కనిపిస్తుంది.

ఈ కొత్త చిత్రానికి ఎస్. ఎస్. థ‌మన్ సంగీతం అందిస్తున్నారు. బాల‌య్య గ‌త సినిమా 'అఖండ‌'కి సంగీతం అందించింది థ‌మ‌నే. పాట‌లు స‌హా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో థియేట‌ర్ల‌ని ద‌ద్ద‌రిల్లించారు. అందుకే మ‌రోసారి థ‌మ‌న్ ని సీన్ లోకి తెస్తున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ లాంచ్ అయిన నాటి నుంచి జ‌రిగే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం బాల‌య్య అండ్ కో 107వ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారు.

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఆ సినిమా తుది మెరుగులు దిద్దుకుంటుంది. టీమ్ నిర్మాణ నంత‌ర పనుల్లో బిజీ అయింది. సంక్రాంతి కానుక‌గా  జ‌న‌వ‌రి 12 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బ్యాలెన్స్ ప‌నుల్నింటిని పూర్తి చేసే  ప‌నిలో ప‌డ్డారు.

పైగా ఈసారి బాల‌య్య అన్ స్టాప‌బుల్ తో త‌న లో కొత్త యాంగిల్ ని కూడా త‌ట్టిన నేప‌థ్యంలో రిలీజ్  అవుతోన్న సినిమా కావ‌డం విశేషం. బాల‌య్య‌కి ఆ షో ప్ర‌త్యేక ఇమేజ్ ని తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ  108వ  చిత్రాన్ని ష‌న్ సైన్ స్ర్కీన్స్ నిర్మిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News