ఆ నటిని నిర్మాత మోసం చేశాడట!

Update: 2015-08-27 07:45 GMT
అమెరికా వెళ్లి అక్కడి వివాహ కార్యక్రమాల్లో డాన్సులు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఒక నిర్మాత చెప్పడంతో అమెరికా వెళ్లడానికి సిద్ధపడింది ఒక నటి! కానీ... ఇంతలోనే అనుకోని రీతిగా శ్రీకృష్ణుడి జన్మ స్థలంలో పోలీసు విచారణ ఎదుర్కొవాల్సి వచ్చింది. చెన్నైలోని అమెరికా కాన్సులేట్ అధికారుల కంప్లైట్ తో ఆ నటిని, ఆమె సహచరుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు!

విషయానికి వస్తే... కేరళకు చెందిన సహాయ నటి నీతూ కృష్ణ వాసు అమెరికా వీసా కోరుతూ చెన్నై లోని అమెరికన్ కాన్సులేట్ కు వచ్చి, కొన్ని పత్రాలు సమర్పించింది. అయితే ఆ పత్రాలు నకిలీవి అని గ్రహించిన కాన్సులేట్ అధికారులు సమీపంలోని రాయపేట పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో నీతూ ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై స్పందించిన నీతూ కృష్ణ... వీసాకోసం రెండు లక్షలు ఖర్చు అవుతుందంటే నమ్మి రాజి అనే సినీ నిర్మాతకు రెండు లక్షల రూపాయలు ఇచ్చానని... అయితే అతడు తనను మోసం చేసాడని బోరుమంది. ప్రస్తుతం రాజీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు!
Tags:    

Similar News