చూసినంతనే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం నీతూచంద్రది. గోదావరి సినిమాలో స్వార్థమున్న మరదలి పాత్రను పోషించిన ఆమె తెలుగోళ్లను బాగానే ఆకట్టుకుంది. ఆమె అందానికి ఫ్లాట్ అయిన కుర్రాళ్లు చాలామందే ఉన్నా.. ఆమెకు రావాల్సిన అవకాశాలు మాత్రం రాలేదు. తర్వాత తెలుగు సినిమాలో ఆమె పెద్దగా ఛాన్సులు రాలేదు. ఆమె ముంబయిలో ఉంటుంది.. అందుబాటులో ఉండదన్న మాట సినిమా ఇండస్ట్రీలో వినిపించేది.
ముంబయిలో ఉన్న చాలామంది నటీమణులు అందుబాటులోకి వచ్చినా నీతూచంద్ర మాత్రం ఎందుకు టచ్ లోకి రాదన్న ప్రశ్న చాలామందిలో వినిపించినా.. ఏమో అంటూ సరిపుచ్చుకునేవారు. అలా తనకొచ్చిన మొదటి సినిమాలోనే తళుక్కుమన్నా.. ఆ తళుకులు ఇండస్ట్రీని ఆకర్షించలేకపోయాయని చెప్పాలి. ఇటీవల సినీ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ మీద ఆమె రియాక్ట్ అయ్యారు.
అందచందాలకు ఏ మాత్రం వంక పెట్టని నీతూచంద్రకు ఛాన్సులు లేకుండా చేసింది క్యాస్టింగ్ కౌచ్ కొరివి దెయ్యమేనన్న సంచలన నిజాన్ని ఆమె చెప్పేశారు. ఎవరైనా.. ఎంతటి ఆఫరైనా సరే.. ఆ కమిట్ మెంట్ ఇచ్చేందుకు నో అంటే నో చెప్పేసి ససేమిరా అనటమే తనకు అవకాశాలు రాకుండా పోయిన అసలు నిజాన్ని ఆమె బయటపెట్టారు. తన కెరీర్ లో తనకు ఎదురైన అనుభవాల చిట్టాను విప్పిన ఆమె.. అలాంటి ఆఫర్లకు తాను ఎలా రియాక్ట్ అయ్యానో చెప్పారు.
ఆఫర్లు చాలానే వచ్చినా.. కమిట్ మెంట్ విషయంలో ముందుకు వెళ్లకపోవటమే తనకు చాలా ఛాన్సులు మిస్ అయిన విషయాన్ని స్పష్టం చేసిన నీతూ.. అటు బాలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ కమిట్ మెంట్ ప్రపోజల్ ఎలా ఉంటుందో వివరంగా చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే ఆ విషయాన్ని చెబితే..
కెరీర్ ప్రారంభంలో చాలానే చేదు అనుభవాలు ఫేస్ చేయాల్సి వచ్చింది. 2007లో ట్రాఫిక్ సిగ్నల్.. ఓయో లక్కీ.. లక్కీ ఓయో.. వరుస విజయాల తర్వాత ఒక టాప్ ఫిలిం మేకింగ్ సంస్థ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడటానికి రావాలన్నారు. ఆఫీసుకు పిలిచారు. చెప్పలేనంత ఉత్సాహంతో.. బోలెడన్ని కలలతో అక్కడికి చేరుకున్నా. సదరు పెద్దతో కలిసి.. మీతో కలిసి పని చేయటం నాకెంత ఇష్టమో తెలుసా? అని చెప్పా. దానికాయన.. అది నీ చేతుల్లోనే ఉంది నీతూ అన్నారు. అప్పటికి నాకు 23 ఏళ్లే. ఆయన అన్నది వెంటనే అర్థం కాలేదు. అదే చెప్పా.
దానికి ఆయన సింఫుల్ గా రియాక్ట్ అవుతూ.. తనకేం కావాలో కూల్ గా చెప్పారు. ఆయన చెప్పింది అర్థమయ్యాక వెంటనే బయటకు వచ్చేశా. లిఫ్ట్ లో భోరున విలపించా. అప్పటివరకూ కన్న కలలు కూలిపోవటమే కాదు.. పెద్ద బ్యానర్లో నటించే ఛాన్స్ ఆయన మాటతో పోయింది.
మరో ఉదంతంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద సినీ రచయిత కమ్ దర్శకుడు కలిశాడు. ఆ మధ్యన ఎంతోమందితో కలిసి చేశావు. మన ఇద్దరం కలిసి పని చేయకపోవటం ఏమిటంటూ హుషారుగా స్టార్ట్ చేశారు. తర్వాతి కాలంలో ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. కొంతకాలం వాట్సాప్ మెసేజ్ లు నడిచాక.. చివరకు సినిమాలో నటించే టైం వచ్చేసరికి తనకేం కావాలో స్పష్టంగా చెప్పేశాడు. అతనితో కలిసి ఉండాలన్నాడు. నిజానికి అతడు అలాంటోడని నేను అస్సలు అనుకోలేదు. అదే విషయాన్ని చెప్పా. కానీ.. తాను అలాంటోడినేని ముఖం మీదనే చెప్పేశాడు.
మరో ఉదంతంలో ఒక ప్రముఖ సినీ దర్శకుడి దర్శకత్వంలో పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి సుదీర్ఘమైన చర్చ జరిగింది. మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన కాసేపటికి మేసేజ్ వచ్చింది. ఈ సాయంత్రం ఏం చేస్తున్నావని. ఏమీ చేయట్లేదని చెప్పా. అందుకు ఆయన స్పందిస్తూ.. ఇంటికి రావొచ్చుగా అన్నాడు. నాకిష్టం లేదన్నా. అంతే.. అప్పటివరకూ ఎంతో ఆసక్తిగా మాట్లాడిన అతడు.. నేరుగా బెదిరింపుల్లోకి వచ్చేశాడు. తనను కాదంటే ప్రాజెక్టు నుంచి తీసేస్తానన్నాడు. అయినా నో చెప్పేశా. ఇంత చిన్నదానికి అంత పెద్ద ప్రాజెక్టు వదులుకుంటావా? అన్నాడు. అవునని కచ్ఛితంగా చెప్పేశా . ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయంటూ గోదావరి బ్యూటీ తన అనుభవాల్ని ఏకరువు పెట్టింది.