ఫోటో స్టోరి: పెళ్లయినా తగ్గట్లేదుగా

Update: 2018-05-21 05:46 GMT
బాలీవుడ్ లో పెద్దగా హీరోయిన్ గా రాణించకపోయినా ఓ మోస్తరుగా స్పెషల్ పాత్రలతో కెరీర్ ను 18 ఏళ్ళు బాగానే నెట్టుకొచ్చింది నేహా ధూపియా. ఇక కాంట్రవర్షియల్ న్యూస్ లు ఆమె కెరీర్ లో అలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ఎలాంటి పాత్రలు వచ్చినా కూడా బాషా బేధం చూపకుండా ఇన్నేళ్ళు రాణించిన నేహా ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 37 ఏళ్ల వయసులో ఎవరు ఊహించని విధంగా సింపుల్ గా సీక్రెట్ గా పెళ్లిని కానిచ్చేసింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే..పెళ్లయ్యింది కదా గ్లామర్ గర్ల్ హోదాకు గుడ్ బాయ్ చెప్పేసినట్లే అని అంతా అనుకుంటున్న సమయంలో అమ్మడు ఎవరు ఊహించని విధంగా ఫొటో షూట్స్ తో ఇంకా షాక్ ఇచ్చింది. రీసెంట్ గా మ్యాక్సీమ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫొటో షూట్ లో వైట్ షట్ - లో దుస్తుల్లో సొగసులను తనదైన శైలిలో ప్రజెంట్ చేసింది. బాత్ టాబ్ పై సెక్సీగా కూర్చొని స్టైలిష్ హెయిర్ స్టైల్ తో కొంటె చూపుతో కలవరపెట్టింది. లెగ్స్ అందాల గురించి ఇక స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

వయసు నాలుగు పదుల్లోకి వస్తున్నా కూడా నేహా ధూపియా అందంలో ఏ మాత్రం తేడా రానివ్వకుండా మెయింటైన్ చేస్తోంది. మరి ఈ తరహలో స్టిల్ ఇవ్వడం చూస్తుంటే బాలీవుడ్ స్క్రీన్ పై ఇంకా తన అందాలకు పని ఉందేమో అని సోషల్ మిడియలో కామెంట్స్ వినబడుతున్నాయి.
Tags:    

Similar News