చిరుత బ్యూటీ ప‌దేళ్లకిలా..!

Update: 2019-01-20 10:05 GMT
ప‌దేళ్ల క్రితం రూపంతో పోలిస్తే, నేటి రూపంలో ఎంతో తేడా క‌నిపించాలి. ఏజ్ బార్ అయిపోవాలి. కానీ సెల‌బ్రిటీల విష‌యంలో అదంతా రివ‌ర్స్ అవుతోంది. అప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు ఇంకా హాట్ గా, అందంగా క‌నిపిస్తున్నారు. క‌థానాయిక‌లైతే అమృతం తాగిన దేవ‌క‌న్య‌ల్లా త‌ళ‌త‌ళ‌లాడిపోతున్నారు. అందానికి వ‌య‌సు అడ్డంకి కాద‌ని నిరూపిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సంగ‌తి `10 ఇయ‌ర్స్ ఛాలెంజ్`లో రివీల‌వుతోంది. ప‌దేళ్ల నాటి ఫోటోని నేటి ఫోటోతో జోడించి తార‌లు ఫ్యాన్స్ ను షాక్ కి గురి చేస్తున్నారు.

తాజాగా చిరుత ఫేం నేహా శ‌ర్మ సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసిన ఓ ఫోటో వేడెక్కిస్తోంది. ప‌దేళ్ల క్రితం నేను ఇలా ఉండేదానిని. బీచ్ లో జ‌ల‌క‌మాడి త‌డిపొడి హెయిర్ తో రంగు మారిన‌(టాన్) చ‌ర్మంతో అప్పుడు అలా ఉన్నాను. ఇదిగో ఇప్పుడిలా మారిపోయాను.. ఛాలెంజ్ యాక్సెప్టెడ్‌.. టెన్ ఇయ‌ర్స్ ఛాలెంజ్.. ఫిట్ నెస్ మోటివేష‌న్!! అంటూ ఇన్ స్టాలో కామెంట్ ని పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.

ఈ ఫోటో నాడు `చిరుత`లో బీచ్ సీన్ కి సంబంధించిన‌ది. స‌ముద్రంలో మ‌ర‌బోటు దారి త‌ప్పి దీవిలో చిక్కుకున్నాక స‌న్నివేశంలో ఈ అమ్మ‌డు అలా క‌నిపించింది. చెర్రీ నాయిక‌గా  నాడు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టి దృశ్య‌మది. అప్ప‌టికి ఇప్ప‌టికి నేహాలో డెవ‌ల‌ప్ మెంట్ ఎంత‌? అంటే ఇదిగో ఇదే ఎగ్జాంపుల్. పొట్టి డెనిమ్ నిక్క‌రు నుంచి టూపీస్‌- ప్యాంటీకి .. బాగానే ఎదిగిందని చెప్పొచ్చు. అన్న‌ట్టు నేహా శ‌ర్మ ఇటీవ‌ల ఓ క్రేజీ సినిమాకి సంత‌కం చేసింది. హేరా ఫేరి 3 అనే భారీ మ‌ల్టీస్టార‌ర్ లోనూ నేహా న‌టిస్తోంది.
Tags:    

Similar News