చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నేహాశర్మ. ఆరంగేట్రమే రామ్ చరణ్ సరసన అవకాశం అందుకున్నా.. అటుపై ఎందుకనో మళ్లీ ఇక్కడ కనిపించలేదు. ఏయ్ బాబూ.. ఇటు రా! అని పిలిచిన నేహాని మన యూత్ బాగానే వోన్ చేసుకున్నా ఆ తర్వాత తీవ్రంగా నిరాశపరుస్తూ అటు బాలీవుడ్ వైపే వెళ్లిపోయింది. అయితే అక్కడా ఈ అమ్మడి ఆటలు అంతంతమాత్రమే. అడపాదడపా మాత్రమే అవకాశాలొస్తున్నాయి. కారణం ఏదైనా నేహా కథానాయికగా రాణించలేదన్నది వాస్తవం.
హీరోయిన్ అవ్వకపోతేనేం.. ఈ అమ్మడికి మోడలింగ్ లో అవకాశాలకేం కొదవ లేదు. నిరంతరం అందాల ఆరబోతతో చెలరేగిపోతూ సామాజిక మాధ్యమాల్లో - నెటిజనుల్లో వాడి వేడిగా చర్చకొస్తోంది. ఓవైపు ర్యాంప్ వాక్ లు - మరోవైపు యాడ్ షూట్ లు.. వేరొక వైపు మ్యాగజైన్ కవర్ పేజీ సోకులతో కాలం వెల్లదీస్తోంది. 2016లో మూడు సినిమాలు - 2017లో మూడు సినిమాల్లో నటించినా నేహా ఉనికి మాత్రం ఏమంత చాటుకోలేకపోయింది. ఈ ఏడాది బాలీవుడ్ లో క్రేజీ సీక్వెల్ హేరాపేరి 3లో నటిస్తోంది. అక్షయ్ కుమార్ - పరేష్ రావల్ - సునీల్ శెట్టి లాంటి స్టార్లు నటిస్తున్న ఈ చిత్రంలో నేహా తళుక్కున మెరవనుందిట.
ఆ క్రమంలోనే కవర్ పేజీలపైనా ఇటీవల వేడి పెంచుతోంది. తాజాగా మ్యాగ్జిమ్ కవర్ పేజీపై ఎర్ర రంగు బికినీలో దర్శనమిచ్చి పెద్ద షాకిచ్చింది. బికినీ బీచ్ సొగసుల్ని తెరనిండుగా ఆవిష్కరించేందుకు తనకేమాత్రం అభ్యంతరం లేదని మరోసారి చెప్పకనే చెప్పింది. మొత్తానికి మరోసారి యూత్ ఐ బాల్స్ ని గిరగిరా తిప్పేసింది. కనీసం ఈ బికినీ సొగసులు చూసైనా మన దర్శకనిర్మాతలు మరోసారి టాలీవుడ్ కి పిలుస్తారేమో చూడాలి.