బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ఆకాశంమంత ఇమేజ్ వచ్చినా ఇప్పటికీ చాలా సింపుల్ గానే ఉంటాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తుల్లో ప్రభాస్ లాంటివారు చాలా అరుదుగా ఉంటారు. అదేమాట అతడితో కలిసి నటించిన వారంతా చెబుతుంటారు. రీల్ లైఫ్ లో ప్రభాస్ తో శతృత్వం పెట్టుకున్నా రియల్ లైఫ్ లో అతడికి ఫ్యాన్ అయిపోయానంటున్నాడు బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్.
‘‘ప్రభాస్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఒక మామూలు పర్సన్ ను కూడా ఎంతో గౌరవిస్తూ అతడు మాట్లాడే తీరు కచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. టాలీవుడ్ లో తనో పెద్ద స్టార్. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినా చాలా సింపుల్ గా ఉంటాడు. నాకు అతడి తీరు చాలా నచ్చింది’’ అంటూ ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తతాడు నీల్ నితిన్. ‘‘ఓ హీరో ఒక ప్రాజెక్టును నమ్మి తన కెరీర్‌లో ఐదేళ్ల టైం దానికే పూర్తిగా కేటాయించడం అన్నది అత్యంత అరుదైన విషయం. వేరే యాక్టర్ ఎవరూ గ్యారంటీగా అంత సాహసం చేయరు. బాహుబలి ఘన విజయంతో ఆ కష్టానికి ప్రతిఫలం కనిపించింది. సినిమా పట్ల అతడి డెడికేషన్ సింప్లీ సూపర్’’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
యువీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న సాహో సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ గా విలన్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరూ తెలుగు తెరపై కనిపించడం ఇదే మొదటిసారి. సాహో సినిమా తెలుగుతోపాటు తమిళం, మళయాళం, హిందీ భాషల్లోనూ ఒకేసారి రూపొందిస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో యాక్షన్ ఓరియంటెడ్ ఎంటర్ టెయినర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.