ప్రభాస్‌ ఒక మర్రి చెట్టు మాదిరి!

Update: 2018-08-27 13:18 GMT
టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంతో బాలీవుడ్‌లో కూడా భారీ స్టార్‌ డం ను దక్కించుకున్నాడు. ‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ స్థాయి అమాంతం పెరిగి పోయింది. అయినా కూడా ప్రభాస్‌ మాత్రం ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రానికి ఒక కొత్త నటుడి మాదిరిగానే వర్క్‌ చేస్తున్నాడు అంటూ ఆమద్య దర్శకుడు సుజీత్‌ మరియు నిర్మాతలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అచ్చు అదే మాటను ‘సాహో’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్‌ స్టార్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ అంటున్నాడు.

ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో దాదాపు 200 కోట్లకు పైచిలుకు బడ్జెట్‌ తో రూపొందుతున్న ‘సాహో’ చిత్రంలో కీలక పాత్రను నీల్‌ నితిన్‌ ముఖేష్‌ పోషిస్తున్నాడు. ఈయన పలు బాలీవుడ్‌ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. తాజాగా ఒక ఇంగ్లీష్‌ పత్రికకు ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సాహో షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుండి కూడా ప్రభాస్‌ ను ఆకాశానికి ఎత్తేస్తున్న నితిన్‌ ముఖేష్‌ తాజాగా మరోసారి ప్రభాస్‌ గొప్పదనంను చెప్పుకొచ్చాడు.

ఇంటర్వ్యూలో నితిన్‌ ముఖేష్‌ మాట్లాడుతూ.. నా చిన్నప్పటి నుండి మా నాన్న చెట్లలో మర్రి చెట్టు చాలా గొప్పది - చెట్టు ఎంత ఎదిగినా కూడా దాని ఊడలు భూమికి చేరతాయి. అలాగే మనుషులు కూడా ఎంత సంపాధించినా - ఎంతగా పేరు తెచ్చుకున్నా కూడా మర్రి చెట్టులా వ్యవహరించాలి అంటూ ఉండేవాడు. ప్రభాస్‌ ను చూస్తుంటే మర్రి చెట్టు గుర్తుకు వస్తుంది. ప్రభాస్‌ ఒక స్టార్‌ హీరో అనే విషయాన్ని ఎక్కడ కూడా చూపించకుండా వ్యవహరిస్తాడు.

మేము సాహో చిత్రీకరణ కోసం దుబాయిలో ఉన్న సమయంలో నా భార్య ప్రెగ్నెంట్‌ అంటూ విషయం తెల్సిందే. అదే విషయాన్ని ప్రభాస్‌తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులకు చెప్పాను. రాత్రి సమయంలో నా రూంకు వచ్చి భారీగా బహుమతులు ఇచ్చి - సొంతంగా పార్టీ ఇచ్చాడు. ఇతరుల సంతోషాలను ప్రభాస్‌ బాగా షేర్‌ చేసుకుంటాడు అంటూ నితిన్‌ ముఖేష్‌ చెప్పుకొచ్చాడు. శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న సాహో చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News