కత్తి విలన్ పెళ్లికి కోట్లలో ఖర్చు

Update: 2017-02-09 16:54 GMT
సినిమా హీరోలు తమ పెళ్లి కోసం కోట్ల రూపాయలు వెచ్చించడం ఇప్పుడు కామన్ అయిపోయింది. కొందరు హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నారు కానీ.. ఎక్కువ మంది మాత్రం భారీ మొత్తంలోనే వెచ్చిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి గ్రాండ్ వెడ్డింగ్స్ జాబితాలో నీల్ నితిన్ ముకేష్ పెళ్లి కూడా చేరిపోయింది.

ఇతడు మనకు డైరెక్టుగా తెలియదు కానీ.. రీసెంట్ గా చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన మూవీ ఖైదీ నంబర్ 150కి ఒరిజినల్ అయిన కోలీవుడ్ మూవీ కత్తిలో.. విలన్ గా నటించాడు నీతిన్ ముఖేష్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో హీరోగానే ట్రై చేశాడు కానీ.. తర్వాత కేరక్టర్ వేషాలు.. విలన్ వేషాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. సుదీర్ఘకాలంగా తాను ప్రేమిస్తున్న రుక్మిణి సయాయ్ ను.. ఫిబ్రవరి8న పెళ్లాడాడు ఈ యాక్టర్. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నీల్ నితిన్- రుక్మిణిల వివాహం జరగగా.. ఈ పెళ్లి.. ఆతిథ్యం కోసం కోట్ల కొద్దీ ఖర్చు చేసినట్లు చెప్పుకుంటున్నారు.

అయితే.. ఇద్దరి కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉండడంతో.. ముందు జరిగిన పరిచయం.. ప్రేమగా మారి.. ఇప్పుడు పరిణయం వరకు దారి తీసింది. రుక్మిణి నాకు తగిన జోడీ అంటున్న నీల్ నితిన్ ముఖేష్..త్వరలో ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News