'స్వాతిముత్యం' సినిమాతో హీరోగా మంచి మార్కులు వేయించుకున్న బెల్లంకొండ గణేష్ ఈ మూవీ అందించిన ఉత్సాహంతో రెండవ సినిమాని కూడా లైన్ లో పెట్టేశాడు. తను నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'నేను స్టూడెంట్ సార్'. అవంతిక దసాని హీరోయిన్ గా పరిచయం అవుతున్నీ ఈ మూవీకి రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్వీ2 ఎంటర్ టైన్ మ ఎంట్స్ బ్యానర్ పై 'నాంది' మూవీ నిర్మాత సతీష్ వర్మ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్న టీజర్ ని శనివారం ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. 'స్వాతిముత్యం'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ గణేష్ తన ఇన్నోసెన్స్ తో ఈ మూవీలో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అదే తరహాతో మరో కొత్త కథతో తను నటిస్తున్న మూవీ 'నేను స్టూడెంట్ సర్'. ఐఫోన్ 12 ని పోగొట్టుకున్న ఓ ఇన్నో సెంట్ స్టూడెంట్ చూట్టూ సాగే కథగా ఈ మూవీని తెరకెక్కించినట్టుగా టీజర్ తో స్పష్టమవుతోంది.
'ఐఫోన్ 12 సిరీస్ మార్కెట్ లోకి వచ్చేస్తోంది. దీని ప్రీ ఆర్డర్ బుకింగ్ మంగళవారం నుంచే ప్రారంభం కాబోతోంది... అనే వాయిస్ లో టీజర్ మొదలైంది. బ్లాక్ ఐ ఫోన్ 64 జీబీ 89,999 రూ. షో రూమ్ లో కట్టి ఐఫోన్ 12 ని తీసుకున్న హీరో నుంచి ఆ ఫోన్ ని కొట్టేస్తారు.
అయితే ఆ ఫోన్ పోయిందని కమీషనర్ గారిని కలవాలని హీరో స్టేషన్ కి వెళతాడు. తాను కష్టపడి 89,999 రూ. పెట్టి కొనుక్కున్న ఐఫోన్ పోయిందని చెబితే దానికి కమీషనర్ గారెందుకు దగ్గర్లో వున్న పోలీస్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమనడం.. కంప్లైంట్ ఇవ్వాల్సిందే పోలీస్టేషన్ మీద అని బెల్లంకొండ గణేష్ చెబుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆ తరువాత కమీషనర్ గా సముద్రఖని హీరోని బెదిరిస్తున్న తీరు.. నిన్నెవడో ప్లాన్ చేసి పెద్ద రింగులోకి నెట్టేశాడని సునీల్ చెబుతున్న డైలాగ్ లు ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని స్పష్టం అవుతోంది. ఇంతకీ ఐఫోన్ 12 వెనక దాగివున్న అసలు కథేంటీ? .. తన ఫోన్ లో ఏముంది?.. కమీషనర్ ఎందుకు ఆ యువకుడి ఫోన్ ని కొట్టేసి తనపైనే కేసుపెట్టి వేధించడం మొదలు పెట్టాడు? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఓ స్టూడెంట్ చుట్టూ సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించిన తీరు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా వుంది. శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్ దీప్, ప్రమోదిని, రవి శివతేజ తదితరులు నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View