శర్వానంద్ హీరోగా సిద్దార్థ్ కీలక పాత్రలో నటించిన మహా సముద్రం గత నెల 14వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. థియేటర్ రిలీజ్ అయిన సరిగ్గా నెల రోజులకు అంటే నేటి నుండి మహాసముద్రం మళ్లీ వచ్చింది. అయితే ఈసారి వచ్చింది ఓటీటీలో.. థియేటర్ లో విడుదల అయిన సమయంలో చూడాలనుకుని టాక్ విన్న తర్వాత మెల్లగా చూడవచ్చు అనుకున్న వారు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన మహా సముద్రం వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను అందుబాటులో ఉంచారు. తెలుగు తో పాటు తమిళ వర్షన్ ను కూడా ఉంచినట్లుగా నెట్ ఫ్లిక్స్ వారు అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా మహా సముద్రం సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేశారనే టాక్ ఉంది. ఆ రేంజ్ లో ఖర్చు చేసిన నెట్ ఫ్లిక్స్ వారు విడుదల సమయంలో కనీస హడావుడి చేయలేదు అంటూ కొందరు శర్వానంద్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా వచ్చి నెల రోజులే అయ్యింది కనుక ఇంకా జనాల్లో సినిమా గురించిన చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఓటీటీ స్ట్రీమింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా మంచి లాభం ఉంటుందని.. కాని పబ్లిసిటీ సరిగా చేయక పోవడం వల్ల నష్టం తప్పదు అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని కొన్ని రోజుల ముందు నుండే పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉంటే బాగుండేది అంటున్నారు.
మహాసముద్రం సినిమా భారీ అంచనాల నడుమ వచ్చి నిరాశ పర్చింది. సినిమా చిత్రీకరణ సమయంలో అజయ్ భూపతి ఆర్ ఎక్స్100 సినిమా రేంజ్ లో ఈ సినిమా కూడా తీస్తాడని అంతా ఆశపడ్డారు. కాని అనూహ్యంగా సినిమా బొక్క బోర్లా పడింది. ఏమాత్రం ఆకట్టుకోని ప్రేమ కథ మరియు ఎమోషన్స్ ఇంకా యాక్షన్ సన్నివేశాలు సినిమాను భారంగా మార్చాయి అంటూ రివ్యూలు వచ్చాయి. శర్వా నటన మరియు సిద్దు నటన బాగానే ఉన్నాయి. సినిమా మెయిన్ సోల్ మాత్రం చెడిపోయింది అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహాసముద్రం సినిమా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సమయంలో అభిమానులు మళ్లీ ఒక సారి మెల్లగా ఇష్టమైన సన్నివేశాలను రివైండ్ చేసుకుంటూ స్ట్రీమింగ్ చేస్తారేమో చూడాలి.