నెట్ ఫ్లిక్స్ లో RRR విశేష ఆదరణ దక్కించుకుంటోంది. అంతర్జాతీయ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ మూవీని వీక్షించి ఆర్.ఆర్.ఆర్ మేకింగ్ .. నటీనటుల ప్రదర్శన .. వీఎఫ్ ఎక్స్ వంటి విభిన్న అంశాలపైనా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ నుంచి స్టార్ డైరెక్టర్లు.. యాక్టర్లు .. రైటర్లు.. సాంకేతిక నిపుణులు పొగిడేస్తున్న తీరు అసాధారణం.
ఇంతకుముందే డాక్టర్ స్ట్రేంజ్ ఫేం.. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్కాట్ డెరిక్ సన్ ఆర్.ఆర్.ఆర్ పై ప్రశంసలు కురిపించాడు. తనకు ఈ సినిమా బాగా నచ్చిందని అన్నారు. ఇప్పుడు ఆస్కార్ విజేత అయిన ప్రముఖ దర్శకుడు మాథ్యూ ఎ చెర్రీ RRRని ఒక ఇతిహాసంతో పోల్చాడు.
అయితే తనకు జంతువులతో ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ల్యాండింగ్ సీన్ నచ్చలేదని అన్నాడు. అది హాస్యాస్పదంగా ఉన్నా కానీ అపురూపంగా కనిపించిందని కూడా అన్నాడు. RRRకి ఆస్కార్ నామినేషన్ వస్తుందని కూడా మాథ్యూ ఆశించారు. జంతువులతో ఎన్టీఆర్ జంప్ సీన్ కట్ వీడియోని కూడా ఆయన సోషల్ మీడియాల్లో షేర్ చేసారు.
నెట్ ఫ్లిక్స్ సీఈవో టిఇడి సరండోస్ ఈ సినిమాని చూడని ప్రతి ఒక్కరూ వీక్షించాలని సిఫార్సు చేసాడు. ``మీరు ఇంకా నెట్ ఫ్లిక్స్ లో RRRని చూడకపోతే తప్పక చూడండి.
ఈ సంవత్సరం మీరు చూడబోయే సినిమాల్లోనే ఇది అత్యంత క్రేజీ థ్రిల్ రైడ్. హిందీలో ఇంగ్లీషు ఉపశీర్షికలతో ఇది బ్లాస్ట్ మూవీ`` అని వ్యాఖ్యను జోడించారు. ఇంకా ఇబ్బడి ముబ్బడిగా ఆర్.ఆర్.ఆర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
రామ్ చరణ్ - ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువవుతోంది. ఇది హాలీవుడ్ ప్రముఖుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇందులో నటించిన టాలీవుడ్ స్టార్లకు హాలీవుడ్ నుంచి అవకాశాలు వెల్లువెత్తే అవకాశం కనిపిస్తోంది.