మూడేళ్ల క్రితం ఢిల్లీ లో చోటు చేసుకు బురారీ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. భాటియా కుటుంబానికి చెందిన 11 మంది ఉరేసుకుని చనిపోవడం అప్పట్లో పెను సంచలనంగా నమోదైంది. ఈ కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. చనిపోయిన వారంతా 10 సంవత్సరాల నుంచి 80 ఏళ్ల వయసులో గలవారు. అయితే అందులో కొంత మందిని గొంతు కోసారు. చంపేసి ఉరేసుకుని చనిపోయినట్లు..ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఇది హత్యా? ఆత్మ హత్యా అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ భయానక ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసును చేధించడం పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది.
ఒక్కోక్కరు ఒక్కో రకంగా చంపబడటంతో...కేసును ఎలా మొదలు పెట్టి ఎలా ముగించాలో కూడా పోలీసులకు అర్ధం కాలేదు. కేసు ఇన్వస్టిగేషన్ కు కేంద్రం ప్రత్యేక బృందాన్ని నియమించి విచారణ చేపట్టింది. అయినా ఆ మిస్టరీ విడలేదు. సరిగ్గా ఈ బురారీ మరణాల్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడు నెట్ ప్లిక్స్ `హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్ `ప పేరుతో ఓ డాక్యుమెంటరీని తెరకెక్కిస్తోంది. మొత్తం మూడు ఎపిసోడ్లుగా దీన్ని నెట్ ప్లిక్స్ విడుదల చేస్తోంది. ఈ డాక్యుమెంటరీ రన్ టైమ్ రెండున్నర గంటలు. సామూహిక ఆత్మహత్యలు చుట్టూ కథ తిరుగుతుంది. సత్యాలు..సిద్ధాంతాలు..మూఢ నమ్మకాలు ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెట్ ప్లిక్స్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి కంటెంట్ ని అందించడంలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ మొదటి నుంచి ఓ బ్రాండ్ గా వెలిగిపోతుంది. ఇది దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటన కావడంతో ఈ డాక్యుమెంటరీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంచనాల్ని అంతకంతకు పెంచేస్తున్నాయి.