యూజర్లకు మరో పెద్ద షాక్ ఇవ్వబోతున్న ప్రముఖ ఓటీటీ

Update: 2022-12-23 05:08 GMT
ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 2020 సంవత్సరం నుండి ఓటీటీ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా జనాలు వినోదం కోసం ఓటీటీ లను ఆశ్రయించారు. దాంతో ఓటీటీ ల యొక్క ఖాతాదారులు విపరీతంగా పెరిగాయి.

నెట్‌ ఫ్లిక్స్ యొక్క ఖాతాదారులు గత పదేళ్లుగా పెరుగుతూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గత ఆరు నెలలుగా యూజర్స్ సంఖ్య చాలా తగ్గిందట. అందుకు కారణం పాస్ వర్డ్‌ షేరింగ్‌ చేసుకోవడం అంటూ ఒక అధ్యయనంలో వెళ్లడి అయ్యిందట.

పాస్ వర్డ్‌ షేరింగ్‌ వల్ల ఖాతాదారుల సంఖ్య తగ్గుతుండటంతో నెట్‌ ఫ్లిక్స్ పలు కొత్త కండీషన్స్ ను తీసుకు వస్తుంది. లిమిటెడ్‌ షేరింగ్‌ ఆప్షన్ ను ఇచ్చిన నెట్‌ ఫ్లిక్స్ ఇప్పుడు కొత్తగా మరో ప్రయోగాన్ని మొదలు పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నెట్‌ ఫ్లిక్స్ యొక్క పాస్ వర్డ్ లను షేర్‌ చేసుకోవచ్చు.. కానీ ఇక మీదట షేర్‌ చేస్తే అందుకు తగ్గ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాస్ వర్డ్‌ షేరింగ్ కు ఇప్పటికే కొన్ని దేశాల్లో మూడు నుండి అయిదు డాలర్ల చొప్పున నెట్‌ ఫిక్స్‌ చార్జ్ చేస్తుందట.

ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ విధానాలను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి 1, 2023 నుండి నెట్‌ ఫ్లిక్స్ కొత్త పద్దతి అన్ని దేశాల వినియోగదారులకు వర్తిస్తుందని తెలుస్తోంది. ఈ నిర్ణయం తో నెట్‌ ఫ్లిక్స్ యూజర్లు మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖాతాదారులు తగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు మరింతగా నెట్‌ ఫ్లిక్స్ ను వీడేవారు ఉంటారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News