కంగ‌నే కాదు నెటిజ‌న్ కూడా ఆడుకున్నాడు!

Update: 2022-09-20 04:31 GMT
అలియా భట్ -రణబీర్ కపూర్ జంట‌గా న‌టించిన 'బ్రహ్మాస్త్ర' పార్ట్ వన్ బాక్సాఫీస్ వద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధిస్తోంద‌ని ఒక సెక్ష‌న్ బాలీవుడ్ మీడియాలు ఊద‌ర‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద వాస్త‌వ లెక్క‌లు వేరుగా ఉన్నాయ‌ని కంగ‌న లాంటి న‌టీమ‌ణి సూటిగా విమ‌ర్శిస్తూ చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే. 650 కోట్ల బ‌డ్జెట్ తో తీసిన సినిమా తొలి వీకెండ్ లో 60 కోట్లు వ‌సూలు చేస్తే ఎలా? అంటూ ఇంత‌కుముందు తీవ్రంగా విమ‌ర్శించింది. క‌ర‌ణ్ జోహార్ కాకిలెక్క‌లు చెబుతున్నాడ‌ని బాక్సాఫీస్ లెక్కలు స‌రికాద‌ని కూడా కంగ‌న తూర్పార‌బ‌ట్టింది.

బ్ర‌హ్మాస్త్ర ఆదివారాలు సెల‌వు రోజుల్లో బాగానే వ‌సూలు చేసిన మాట వాస్త‌వం అలాగ‌ని పెట్టిన పెట్టుబ‌డిని వెన‌క్కి తెచ్చిందా? అన్న‌దే ఇప్పుడు బిగ్ క్వ‌శ్చ‌న్.  CGI ఫెస్టివ‌ల్ కి త‌గ్గ‌ట్టే అత్యంత‌ భారీ ఖర్చు చేసిన ఈ  మూవీకి రిట‌ర్నులు తేవ‌డం అంత సులువు కాద‌నేది అంద‌రి విశ్లేష‌ణ‌. అయాన్ ముఖ‌ర్జీ ఎంచుకున్న‌ ప్లాట్ లో హోల్స్ గురించి కథన వైరుధ్యాల పైనా నెటిజ‌నులు ఇప్ప‌టికీ విమ‌ర్శిస్తూనే ఉన్నారు. అలియా పాత్ర ఇషా హాఫ్‌ బేక్డ్  అని విమర్శించారు. సినిమా డైలాగ్స్ కి అంత క్రేజ్ లేదు. ప్రేక్షకులు  విమర్శకులు సినిమాలో లోటుపాట్లు సమస్యల గురించి డిబేట్లు పెడుతూనే ఉన్నారు.

చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ - రణబీర్-ఆలియా ఈ వాదనలకు ప్రతిస్పందిస్తున్నారు. స‌మాధానాలిస్తున్నారు. సినిమా నిర్మాత కరణ్ జోహార్ కి ఇంటర్నెట్ లో అలాంటి ఒక ట్రోల‌ర్ ఒక‌రు గ‌ట్టిగానే త‌గిలాడు. బ్రహ్మాస్త్రలోని ఒక సీక్వెన్స్ లో రణబీర్ - అలియా గురూజీ (అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర) నివసించే రహస్య ఆశ్రమానికి వెళ్ళడానికి ప్రయత్నించే సీన్ అది. వారికి సహాయం చేయడం నాగార్జున పాత్ర.. అనీష్ శెట్టి.. అతను గూగుల్ మ్యాప్స్ లో ఆశ్రమం చిరునామాను టైప్ చేస్తాడు.

ఈ దృశ్యాన్ని ప్రస్తావిస్తూ ఆదివారం మధ్యాహ్నం ఒక ట్విట్టర్ వినియోగదారు ఏమ‌ని పోస్ట్ చేశారంటే.. ''ఆ ఆశ్రమం రహస్యంగా ఎందుకు ఉంది?  ఆశ్రమం చిరునామా గూగుల్ మ్యాప్స్ లో ఎలా లీకైందో? చెప్పాలంటూ లాజిక్ ని ప్ర‌శ్నించాడు. ఈ లాజిక్ కోసం సినిమా 300 కోట్లు రాబట్టిందా? భారతీయ సృజనాత్మకత అంటే ఇదేనా? అంటూ కూడా విమ‌ర్శించాడు.

ఈ ట్వీట్ పై కరణ్ జోహార్ స్పందిస్తూ ''గురువు వాస్తవ ప్రపంచంలో మరే ఇతర వ్యక్తిలా జీవిస్తున్నాడు… ఆయన బ్రాహ్మణుల నాయకుడని ఎవరికీ తెలియదు! అతనిది అస్త్రాల ఇల్లు... కాబట్టి వాస్తవ ప్రపంచంలో అతని పేరుతో ఉన్న అతని చిరునామా గూగుల్ మ్యాప్స్ లో ఉంది! అని వివ‌ర‌ణ ఇచ్చాడు.

కరణ్ రిప్లైకి చాలా రియాక్షన్స్ వచ్చాయి. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు ''ట్విట్టర్ లో కొంతమంది ద‌ర్శ‌కుడు అయాన్ తాను ఊహించినదానిని సరిగ్గా రూపొందించడంలో విఫలమయ్యాడని'' విమ‌ర్శించారు. ప్రేక్షకులు కూడా ఈ లాజిక్ ను అర్థం చేసుకోలేకపోతే ఈ పాయింట్ సినిమాలో స్పష్టంగా కనిపించదు. మీ స్క్రిప్ట్ రైటింగ్ డైరెక్షన్ చెక్ చేసుకోండి అని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ని క్రాస్ చేసిందని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. అయితే మీమ్ మేకర్స్ నుండి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ల వరకు దీనిపై సెటైర్లు వేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

మ‌రోవైపు క‌ర‌ణ్ టీమ్ ఈ సినిమాని 300 కోట్ల క్ల‌బ్ లో చేరిందంటూ ప్ర‌చారం చేస్తుంటే చాలా చోట్ల 200 కోట్ల క్ల‌బ్ అంటూ ప్ర‌చారం చేయ‌డం క‌నిపిస్తోంది. మొత్తానికి బ్ర‌హ్మాస్త్ర‌కు అస‌లైన బాక్సాఫీస్ లెక్క‌లు ఏవో తేల‌డం లేదు. కంగ‌న విశ్లేషించిన‌ట్టు 650 కోట్ల బ‌డ్జెట్ సినిమా ఇప్ప‌టికి 200-300 కోట్ల మ‌ధ్య‌నే వ‌సూలు చేస్తే అది బిగ్ డిజాస్ట‌ర్ కిందే లెక్క‌!




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News