మహాభారతంలో ఏ పాత్రకు ఎవరు?

Update: 2017-04-18 17:01 GMT
మహాభారతం.. ఇప్పుడు ఇండియన్ పిలిం ఇండస్ట్రీలో దీని గురించి పెద్ద చర్చే నడుస్తోంది. రాజమౌళి తన కలల సినిమా ఇదే అంటున్నాడు. పదేళ్ల తర్వాత ఈ సినిమాను భారీ స్థాయిలో తీస్తానంటున్నాడు. మరోవైపు షారుఖ్ ఖాన్ కూడా మహాభారతాన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించే ఆలోచనను బయటపెట్టాడు. వీళ్లింకా మాటల్లో ఉండగానే.. మరోవైపు మోహన్ లాల్ మహాభారత కథకు సన్నాహాలు పూర్తి చేసేశాడు. ఆ సినిమాలో లాల్ ఏ పాత్రను పోషిస్తాడో.. భారతంలోని మిగతా పాత్రల్ని ఎవరు చేయబోతారో ఇంకా స్పష్టత రాలేదు. ఐతే ‘మహాభారతం’ సినిమా గురించి పెద్ద చర్చ నడుస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలోనూ జనాలు యాక్టివ్ అయిపోయారు. వెండితెర మహాభారతంలో ఎవరు ఏ పాత్ర చేస్తే బాగుంటుందో వారు సూచిస్తున్నారు.

రాజమౌళి మహాభారతం తీస్తే అందులో తాను కృష్ణుడి పాత్ర చేయాలనుకుంటున్నట్లు అమీర్ ఖాన్ ఇప్పటికే తన ఆసక్తిని వెల్లడించాడు. ఆ పాత్రకు అతను సరిపోతాడనే నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ భీష్ముడి పాత్రకు నూటికి నూరు శాతం సరిపోతాడని.. ఈ పాత్రకు మరో ఛాయిస్ లేదని చాలామంది అంటున్నారు. షారుఖ్ ఖాన్ దుర్యోధనుడి పాత్రకు పర్ఫెక్ట్ అన్నది మెజారిటీ జనాల అభిప్రాయం. అజయ్ దేవగణ్ కర్ణుడి పాత్రకు మంచి ఛాయిస్ అంటున్న జనాలు.. పంచ పాండవుల పాత్రలకు కూడా ఛాయిస్ ఇచ్చేశారు. ధర్మరాజుగా అక్షయ్ కుమార్.. భీముడిగా సంజయ్ దత్.. అర్జునుడిగా హృతిక్ రోషన్.. నకులుడిగా సిద్దార్థ్ మల్హోత్రా.. సహదేవుడిగా వరుణ్ ధావన్ ల పేర్లను ఎక్కువమంది సూచించారు. మరి ‘మహాభారతం’ సినిమా తీయాలనుకుంటున్న వాళ్లు ఏ పాత్రకు ఎవరిని అనుకుంటున్నారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News