ఇంత బిజీలో 'ఆ' పాత్రలు అవసరమా అమ్మడు?

Update: 2021-11-13 04:41 GMT
బాలీవుడ్‌ లో మోస్ట్ బిజీ హీరోయిన్స్ లో కియారా అద్వానీ ఒకరు అనడంలో సందేహం లేదు. ఎంఎస్ ధోనీ సినిమాతో ఆమె బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంది. మన తెలుగు సినిమా అర్జున్‌ రెడ్డి హిందీ వర్షన్ అయిన కబీర్ సింగ్ లో నటించడంతో స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది. కబీర్ సింగ్‌ సినిమా తర్వాత కియారా అద్వానీ క్రేజ్ భారీగా పెరగడంతో ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇదే సమయంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న రామ్‌ చరణ్ శంకర్ ల మూవీ లో కూడా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చరణ్‌ మూవీలో కియారా అద్వానీ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుందని అంటున్నారు. ఇక బాలీవుడ్‌ లో ఈ అమ్మడు వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ కు ఓకే చెప్తూ అలా దూసుకు పోతుంది.

ఈ సమయంలో ఈ అమ్మడు ఇటీవల ఒక సినిమాకు ఓకే చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. హీరోయిన్ గా ఇంత బిజీగా ఉండి.. స్టార్‌ హీరోయిన్ గా దూసుకు పోతున్న సమయంలో అలాంటి పాత్రను చేయాల్సిన అవసరం ఏంటీ అంటూ ఈమెను ప్రశ్నిస్తున్నారు.. ఇంతకు ఆ పాత్ర ఏంటీ.. సినిమా ఏంటీ అనే వివరాల్లోకి వెళ్తే.. విక్కీ కౌశల్ హీరోగా భూమి పడ్నేకర్‌ హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా 'మిస్టర్ లేలే'. ఈ సినిమాను శశాంక్ ఖేతన్ దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్ కరణ్ జోహార్‌ నిర్మిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగానే ఉన్నాయి. విక్కీ కౌశల్ మరియు భూమి పడ్నేకర్‌ లు భార్య భర్తలుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ ఇద్దరు భార్య భర్తలు కొన్ని కారణాల వల్ల గొడవలు పడుతుంటారు. ఆ సమయంలో వీరి మద్యలో ఒక యువతి వస్తుంది. ఆ యువతి పాత్రను కియారా అద్వానీ పోషించబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ఫుల్‌ క్లారిటీగా చెప్పేశారు.

భార్య భర్తల మద్య మూడవ మనిషి వెళ్లడం అది కూడా లేడీస్ వెళ్లడం అనేది చాలా సినిమాల్లో చూశాం. మద్యలో వచ్చిన ఆ లేడీ ఖచ్చితంగా నెగటివ్‌ రెస్పాన్స్ ను పొందాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు పాజిటివ్‌ గా కథ ఉండేలా కోరుకుంటారు. అలాంటి పాజిటివ్ కథలోకి మద్యలో వచ్చే పాత్ర అంటే ఎవరికి కూడా నచ్చదు. అది కూడా భార్య భర్తల మద్య వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ పాత్రను ప్రేక్షకులు నెగటివ్ గా చూస్తారు. అందుకే దానికి తోడు ఆ పాత్ర మెయిన్‌ హీరోయిన్ గా అవ్వడం జరగదు. కనుక కియారా అభిమానులు మిస్టర్ లేలే సినిమా పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేతిలో అయిదు ఆరు సినిమాలు పెట్టుకుని.. పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌ లు చేస్తూ ఎందుకు ఇలాంటి కథలకు మరియు సినిమాలకు ఓకే చెప్తున్నారు కియారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇలాంటి పాత్రలు చేసినప్పుడు మాత్రమే నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవచ్చు. అందుకే కియారా అద్వానీ ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మీడియా వర్గాలు కూడా మిస్టర్ లేలే సినిమాను ఈ సమయంలో కియారా అద్వానీ చేయకుంటే బెటర్ అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో కియారా అద్వానీ అభిప్రాయం ఎలా ఉందో ఆమె నోరు విప్పితే కాని క్లారిటీ రాదు. తాజాగా ఈ అమ్మడు రామ్ చరణ్.. శంకర్ ల కాంబో మూవీ తదుపరి షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌ చేరుకుంది. త్వరలోనే చరణ్‌.. శంకర్‌ కాంబో మూవీ సెట్స్‌ లో కియారా అద్వానీ జాయిన్ అవ్వబోతుంది.
Tags:    

Similar News