హీరో భార్య ఫిజిక్ పై నెటిజన్స్ కామెంట్స్.. ఆమె రియాక్షన్
సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ఫొటోలు వీడియోలు షేర్ చేసిన సమయంలో నెగటివ్ కామెంట్స్ కామన్ గా వస్తూ ఉంటాయి. హీరోయిన్స్ బోల్డ్ పిక్స్ షేర్ చేస్తే పెద్దగా పట్టించుకోకుండా వాటిని ఎంజాయ్ చేసే నెటిజన్స్ ఇతర సెలబ్రెటీలు ముఖ్యంగా హీరోల భార్యలు కాస్త బోల్డ్ గా ఫొటోలను షేర్ చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు. హీరోల భార్యలు అంటే పద్దతిగా ఉండాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ఆమద్య ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో భార్య తన హాట్ ఫొటో షూట్ ను షేర్ చేసిన సమయంలో ఆమెను తీవ్రంగా విమర్శించిన నెటిజన్స్ మళ్లీ ఆమె అలాంటి ఫొటోలు షేర్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా బాలీవుడ్ హీరో కరణ్ వీర్ బోహ్రా భార్య టీజే సిద్దూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇటీవల టీజే సిద్దూ సోషల్ మీడియాలో స్విమ్ సూట్ లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఒక రిసార్ట్స్ లో ఆమె ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను కూడా షేర్ చేసింది. ఆ ఫొటోలపై నెటిజన్స్ తీవ్రంగా స్పందించారు. మీ పొట్ట చూడ్డానికి అంతగా బాగా లేదు. మీరు అస్సలు ఈ ఫొటోల్లో అందంగా లేరు. మీరు ఇలాంటి ఫొటోలు మళ్లీ షేర్ చేయవద్దని కోరుకుంటున్నాము. మీరు మళ్లీ మళ్లీ ఇలాంటి ఫొటోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నామంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. నెటిజన్స్ కామెంట్స్ తో ఆ ఫొటోలు మరింతగా వైరల్ అయ్యాయి. స్విమ్ సూట్ ఆమెకు ఏమాత్రం సెట్ అవ్వలేదు అనేది చాలా మంది వాదన. వారి వాదనకు.. కామెంట్స్ కు టీజే సిద్దూ రియాక్ట్ అయ్యింది.
నేను షేర్ చేసిన ఫొటోల్లో ఎలాంటి ఫిల్టర్ లను వినియోగించలేదు. నా బాడీని నేను ఎప్పుడు కూడా దాచి పెట్టాలనుకోవడం లేదు. నాకు నాలా ఉండటమే ఇష్టం. నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటున్నాను. ఒకరి కోసం నేను ఎప్పుడు కూడా మారాలనుకోవడం లేదు. ఈ విషయంలో నాకు సలహాలు అక్కర్లేదు. నాకు ఎలాంటి బరువు సమస్య లేదు. నేను అతి బరువు ఉన్నట్లుగా నేను భావించడం లేదు. నా పొట్ట ఎక్కువగా ఉందని కొందరు అంటున్నారు. ఆ విషయం లో నేను ఎప్పుడు ఆలోచించలేదు. కొన్నాళ్లుగా నేను ఇలాంటి ఫొటోలను షేర్ చేయలేదు కనుక ఇప్పుడు చూడగానే నాలో కొన్ని మార్పులు మీకు కనిపిస్తూ ఉంటాయి. అందుకు నేనేం చేయలేను అంది. అదే సమయంలో నేను నా బాడీపై మంచి అభిప్రాయంను కలిగి ఉన్నాను. కనుక నా అభిప్రాయం పాజిటివ్ గా ఉన్నంత కాలం ఇలాంటి ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటాను అంది. ముగ్గురు పిల్లలకు తల్లి అయినా కూడా ఇంత అందంగా టీజే సిద్దూ ఉన్నారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.