తాజ్ మహల్ సమాధా? రంగోలిపై ఫైర్

Update: 2020-04-08 23:30 GMT
తాజ్ మహల్ అంటే ప్రేమకు చిహ్నం.. ముంతాజ్ పై షాజహాన్ కు ఉన్న ప్రేమకు ప్రతిరూపం. అమెరికా అధ్యక్షుడంతటి వాడు కూడా వచ్చి ఈ ప్రేమ చిహ్నం చూసి తరించిపోయాడంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకిది ప్రపంచపు వింతగా మారిందో తెలుసుకోవచ్చు.

అయితే తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజ్ మహల్ పై రంగోలి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ విరుచుకుపడుతున్నారు.

రంగోలీ తాజాగా ట్వీట్ చేస్తూ.. 'తాజ్ మహల్ కేవలం సమాధి మాత్రమే.. అది ఎప్పటికీ ప్రేమ చిహ్నం కాదు..' అంటూ నోరు జారింది. అంతేకాదు.. తాజ్ మహల్ ను చాలా మంది సమాధిగా చూస్తారు.. ప్రపంచవింతగా చూడాలని ప్రజలను బలవంతం చేస్తున్నారు.. ముంతాజ్ పై ఉన్న ప్రేమ - గౌరవం తో షాజాహాన్ నిర్మించిన అతిపెద్ద కట్టడం వెనుక ఒళ్లు గగుర్పొడిచే విషయాలున్నాయని.. ఆమెను షాజాహాన్ ఎంతగా హింసించాడో తెలుసా అంటూ రంగోలి ఇష్టమొచ్చినట్టు చరిత్రను వక్రీకరిస్తూ ట్వీట్ చేసింది.

రంగోలీ చేసిన ట్వీట్స్ దుమారం రేపాయి. ముఖ్యంగా నెటిజన్లు, ప్రేమికులు ఆమె తీరుపై దుమ్మెత్తి పోశారు. మీ సర్టిఫికెట్ అవసరం లేదంటూ ఆడిపోసుకున్నారు. ప్రేమకు చిహ్నాన్ని అవమానిస్తావా అని కొందరు ఫైర్ అయ్యారు. ఇలా ప్రతీసారి వివాదాస్పద వ్యాఖ్యలతో రంగోలీ వార్తల్లో నిలుస్తూ విమర్శలను ఎదుర్కొంటూనే ఉంటుంది.
Tags:    

Similar News