ఎంకి చావు సుబ్బికొచ్చిన చందంగా ఒకరి మరణం వెనక కారణాల్ని లాజిక్కుల్ని వెతుకుతూ రకరకాల పేర్లను నెటిజనులు తెరపైకి తెస్తున్నారు. ఆ కోవలోనే బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ పేరు తెరపైకొచ్చింది. అసలు సుశాంత్ ఆత్మహత్యకు సల్మాన్ కి లింకేమిటి? అన్నది చూస్తే ఆశ్చర్యం కలగకుండా మానదు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం సోషల్ మీడియాల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సహా కామన్ జనం.. సుశాంత్ అభిమానులు చెలరేగిపోయారు. ఇందులో ఆలియా భట్.. కరణ్ జోహార్.. కపూర్లు.. బచ్చన్లు.. ఖాన్ లు అంటూ బోలెడంత చర్చ సాగింది. వీళ్లంతా నటవారసుల్ని కాపాడుకునేందుకు బయటి వారిని పరిశ్రమలోకి రానివ్వరని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
అదంతా అటుంచితే నిన్నటిరోజున అంత్యక్రియలకు ముందు సుశాంత్ కడచూపు కోసం వివేక్ ఒబేరాయ్ సహా రియా చక్రవర్తి- కృతి సనోన్ మరికొందరు ఆస్పత్రికి విచ్చేశారు. ఆ క్రమంలోనే హాస్పిటల్ పరిసరాల్లో ఒబేరాయ్ ని చూసిన నెటిజనులు సల్మాన్ టాపిక్ ని తెరపైకి తెచ్చారు. ఇండస్ట్రీలో ఎందరో జీవితాల్ని సల్మాన్ నాశనం చేశాడంటూ ఆరోపించారు. ఇండస్ట్రీ మాఫియా వల్లనే సుశాంత్ మరణించారని తెలిపారు.
ఒబేరాయ్ వచ్చినా కానీ సల్మాన్ ఖాన్ కానీ ఖాన్ లు కానీ ఆస్పత్రికి రాలేదని నెటిజనులు దుమ్మెత్తి పోశారు. ఏదో పోయాక ట్వీట్లు చేశారు కానీ ఎవరూ రాలేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. సుశాంత్ ను చివరి చూపు చూసేందుకు రాలేదని మండిపడ్డారు. ఒబేరాయ్ వంటి స్టార్ ను పరిశ్రమ లో ఎదగనీకుండా సల్మాన్ తొక్కేశారని ఆరోపించారు. ఐశ్వర్యారాయ్ బచ్చన్.. అర్జిత్ సింగ్ వంటి స్టార్లను సల్మాన్ ఎదగనీకుండా తొక్కేశారని కూడా ఆరోపించడం విశేషం. బీయింగ్ హ్యూమన్ మాత్రమే ట్యాగ్ లైన్ పెట్టుకుంటాడు కానీ మనిషిగా ప్రవర్తించడని.. పాదచారులను కార్ తో తొక్కి చంపించాడని.. కృష్ణ జింక ను వేటాడానని.. పరిశ్రమను గుప్పిట్లో పెట్టుకుని ఎందరినో నాశనం చేశాడని తీవ్రంగా ఆరోపించారు.