హ్యాట్సాఫ్‌ సందీప్‌ కిషన్‌.. మీరు రియల్‌ హీరో

Update: 2021-05-04 04:31 GMT
కరోనా మహమ్మారి ఎన్నో లక్షల కుటుంబాల జీవితాల్లో చీకటి నింపుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ఆపదలో ఉన్న వారికి సాయం అవసరం అయిన వారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనాతో కుటుంబ పెద్ద మృతి చెందితే ఒక మద్యతరగతి కుటుంబం ఎంతగా ఇబ్బందులు ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కుటుంబాలు ఎన్నో రోడ్డున పడుతున్నాయి. కొన్ని ఇళ్లలో అమ్మా నాన్న కరోనాతో చనిపోయి పిల్లలు అనాధలు అవుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యంగ్‌ హీరో సందీప్‌ కిషన్ మంచి మనసుతో అనాధలైన ఆ పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు.

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన పిల్లలకు సంబంధించిన సమాచారంను మాకు ఇవ్వండి. మేము ఆ పిల్లలకు మా శక్తి మేరకు సాయం చేస్తాం. వారికి ఫుడ్ మరియు ఎడ్యుకేషన్ ను అందిస్తాం. మీ చుట్టు పక్కల ఎవురు అలాంటి పిల్లలు ఉన్నా కూడా దయచేసి మాకు వారి వివరాలను ఇవ్వండి అంటూ సందీప్‌ కిషన్‌ ఒక మెయిల్‌ ఐడీని ఇవ్వడం జరిగింది. సందీప్‌ కిషన్ టీమ్‌ ఆ పిల్లలను కలిసి వారికి కావాల్సిన అవసరాలు తీర్చడంతో పాటు రాబోయే కొన్ని సంవత్సరాల వరకు వారికి సంబంధించిన బాధ్యత చూసుకుంటారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి ఒక్కరు మంచి మనసుతో ఇతరులకు సాయంగా నిలవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో సందీప్‌ కిషన్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. హ్యాట్సాఫ్‌ సందీప్‌ కిషన్‌ మీరు రియల్‌ హీరో అంటూ ఆయన అభిమానులు మాత్రమే కాకుండా అంతా కూడా అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Tags:    

Similar News