నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందింది. కలకత్తా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది .. అది కూడా 70వ దశకంలో. ఆ రోజుల్లో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని ఈ కథ ముందుకు సాగుతుంది. ఆ దేవదాసీ వ్యవస్థను ప్రశ్నించే 'శ్యామ్ సింగ రాయ్' గా ఈ సినిమాలో నాని కనిపిస్తాడు. ఆ కాలంలో ఉన్న సమస్య .. అప్పటి పరిస్థితులకి ఈ సినిమా అద్దం పట్టింది. కథాకథనాలు .. నాని - సాయిపల్లవి లుక్స్ ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగేలా చేశాయి.
ఈ నెల 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూ ద్వారా నాని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమాను గురించి ఆయన మాట్లాడుతూ .. "ఇప్పటివరకూ ప్రేక్షకులు ఒకలా నన్ను చూస్తూ వచ్చారు. అలా కనిపించడమే సేఫ్ అని నేను అనుకుంటే, నేను ఆ పరిధిని దాటి ముందుకు వెళ్లలేను. నేను తీసుకున్న నిర్ణయం రిస్క్ తో కూడుకున్నదే అని నాకు తెలుసు. కానీ కొత్తదనం కోసం .. నటుడిగా నా స్థాయిని పెంచుకోవడం కోసం అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తుండాలి.
నేను ఈ పాత్రను చేయగలనా? అనే డౌట్ వచ్చిన పాత్రలను ఎంచుకున్నపుడే, నటుడిగా నాకు ఉన్న సత్తా ఏంటనేది నాకు తెలుస్తుంది. నన్ను నేను ఎంతవరకూ నిరూపించుకోగలిగాను అనే విషయం నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే 'జెర్సీ' తరువాత మళ్లీ అంత పేరును నాకు ఈ సినిమా తెచ్చిపెట్టింది. విడుదల రోజున ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసిన తరువాత, నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అనే విషయం నాకు అర్థమైంది. రాహుల్ నాకు కథ చెబుతున్నప్పుడే 'శ్యామ్' ఎలా ఉంటాడనేది నేను ఊహించుకున్నాను. రాహుల్ గీయించిన స్కెచెస్ కూడా అందుకు దగ్గరగానే ఉన్నాయి.
ఈ సినిమా చూసిన తరువాత మా అక్కయ్య కాల్ చేసింది. ఏ సినిమా చూసినా 'చాలా బాగా చేశావురా' అనేది. కానీ ఈ సినిమా చూసిన తరువాత స్క్రీన్ మీద శ్యామ్ తప్ప నాని కనిపించడం లేదురా అని చెప్పింది. అప్పుడే నాకు అర్థమైంది. ఈ క్యారెక్టర్ తప్పకుండా ఎక్కుతుందని. అన్ని ఏరియాల్లో .. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఒకే విధమైన రెస్పాన్స్ వస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోంది. నాకు తెలిసి గత ఐదేళ్లలో తెలుగులో వచ్చిన పోయిటిక్ ఫిల్మ్ 'శ్యామ్ సింగ రాయ్'. ఈ సినిమా చూస్తుంటే ఒక కథ చెబుతున్నట్టుగా కాకుండా ఒక కవిత చదువుతున్నట్టుగా ఉంటుంది. ఈ సినిమాను గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, నవరాత్రుల్లో జరిగిన ఒక లవ్ స్టోరీ ఇది అంటూ చెప్పుకొచ్చాడు.