సారా టెండూల్క‌ర్.. టాప్ హీరోయిన్ కి త‌గ్గ‌దుగా.

Update: 2021-12-16 04:30 GMT
సారా టెండూల్కర్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. భారత క్రికెట్ గాడ్.. మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ - డాక్టర్ అంజలి టెండూల్కర్ ల‌ కుమార్తె. చాలా మంది ప్రముఖ స్టార్ కిడ్స్ తో పోల్చిన‌ప్పుడు సారా తన డౌన్ టు ఎర్త్ నేచర్ తో ప్ర‌జ‌ల‌ దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో 1.5 మిలియన్ల మంది ఫాలోవర్లను క‌లిగి ఉంది సారా. ఒక టాప్ మోడ‌ల్ ని త‌ల‌పించే సారా టెండూల్క‌ర్ నిరంత‌రం హాటెస్ట్ ఫోటోల‌ను అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియా స్పేస్ కు వెళుతుంది. ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్ న‌టీమ‌ణుల‌తో క‌లిసి సారా న‌టించిన వాణిజ్య ప్ర‌క‌ట‌న కూడా వైర‌ల్ అయ్యింది.

సారా నిరంత‌రం ముంబైలో త‌న స్నేహితుల‌తో క‌లిసి రెస్టారెంట్ లు నైట్ లైఫ్ పార్టీల‌కు ఎటెండ‌వ్వ‌డం క‌నిపిస్తుంది.  తన స్నేహితులలో ఒకరు బోయ్ కూడా ఉన్నారు. అత‌డు సారాతో కలిసి డిన్న‌ర్ డేట్ చేస్తున్న ఫోటోలు ఇత‌ర సంద‌ర్భాల్లో సెల్ఫీలు కూడా వైర‌ల్ అయ్యాయి.

బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ అంటే విప‌రీత‌మైన అభిమానం అని చెబుతుంది సారా. `బియింగ్ ఆల్ స్మైల్స్` పై ఆమె ఇటీవ‌లి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ `లవ్ ఆజ్ కల్ 2` స్టార్ వ‌ర‌కూ చేరింది. సారాతో కార్తీక్ కూడా ఆన్ లైన్ వేదిక‌గా క‌నెక్ట‌వ్వ‌డంపై చ‌ర్చ సాగింది. అలాగే సారాకు బోయ్ ఫ్రెండ్ కూడా ఉన్నార‌న్న టాక్ ఉంది. గతంలో క్రికెటర్ శుభమాన్ గిల్ తో సారా టెండూల్కర్ రొమాన్స్ పుకార్లు కూడా ఆన్ లైన్ లో షికార్ చేసాయి. ఇన్ స్టాలో రొమాన్స్ బ‌య‌ట‌ప‌డ‌డంతో ఇద్దరి మధ్య లింక్-అప్ పుకార్లకు దారితీసింది. అయితే దీనిపై ఎవ‌రూ అధికారికంగా వ్యాఖ్యానించలేదు. సారా టాప్ మోడ‌ల్ ని త‌ల‌పించే లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ పై ఇన్ స్టాలో ఇప్పుడు డిబేట్ న‌డుస్తోంది. సారా డిజైన‌ర్ లుక్ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News