దర్శకత్వం.. రచన విభాగంపై నిర్మాతలకు సహజంగానే ఆసక్తి ఉంటుంది. కానీ ఒక్కోసారి ఆసక్తిని మించిపోయి అత్యుత్సాహం బయల్దేరితేనే ముప్పు. అలా నిర్మాతల అత్యుత్సాహం వికటించి ఆ సినిమా పరాజయానికి దారి తీసిందనేది టాలీవుడ్ ఇన్ సైడ్ గుసగుస.
అయిన దానికి కాని దానికి దర్శకుడి పనిలో వేలు పెట్టిన ఫలితం సదరు నిర్మాతలు అనుభవించారనేది ఫిలింసర్కిల్స్ లో ఒకటే డిస్కషన్.. ఆన్ లొకేషన్ సదరు దర్శకుడినే డామినేట్ చేస్తూ మానిటరింగ్ చేయడం.. నటులకు అలా కాదు ఇలా చేయాలి! అంటూ ఎక్స్ ప్రెషన్స్ సహా ప్రతిదీ సూచించడం వగైరా వగైరా ఫింగరింగ్ సదరు యువ దర్శకుడికి టార్చర్ గా మారిందిట. కానీ కొత్త కుర్రాడు కావడంతో ఏమీ అనలేకపోయాడు మొహమాటం కొద్దీ.
ఇక ఈ విషయంలో ఓ సీనియర్ నటుడు అయితే ఆన్ లొకేషన్ లోనే బరస్ట్ అయ్యి.. ఆ నిర్మాతల్నే డైరెక్ట్ చేయమనండి... వాళ్లనే సీన్ పేపర్ రెడీ చేయమనండి!! అనేంత అసహనానికి దారి తీసిందిట. ఏదేమైనా ఆ సినిమా ఇటీవలే రిలీజై ఫ్లాపైంది. మొత్తానికి అత్యుత్సాహం ఫలితం తెరపై కనిపించిందని విమర్శలొస్తున్నాయి. ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి. అనవసరంగా కెలికితే అంతేగా! గాడిద పని గాడిద చేయాలి... గుర్రం పని గుర్రం చేయాలి! అన్న సామెత పుట్టుకొచ్చింది ఇందుకేగా! అనేస్తున్నారు.