ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక ఆస్కార్ పురష్కారాలకు సమయం ఆసన్నం అయ్యింది. ఆస్కార్ కోసం జనవరి 11 నుండి 17వ తారీకు వరకు ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో 80 దేశాలకు సంబంధించిన అకాడమీ సభ్యులు పాల్గొన్నారు.
95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఎప్పుడు నమోదు కానన్ని ఓట్లు ఈసారి నమోదు అయినట్లుగా అకడమీ అధికారికంగా ప్రకటించింది. ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు.
ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ప్రకటన కోసం ఇండియా గతంలో ఎప్పుడు లేనంత ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆర్ఆర్‌ఆర్ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలు కూడా ఓపెన్ కేటగిరీలో నామినేషన్స్ కోసం పోటీ పడుతున్నాయి. అందులో ఆర్ఆర్ఆర్ సినిమాలోని పలు విభాగాలు నామినేషన్స్ ను సొంతం చేసుకుంటాయని అంతా నమ్మకంతో ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పదుల కొద్ది భాషల సినిమాలు ఈ సారి ఆస్కార్ బరిలో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా 301 సినిమాలు పురస్కారం యొక్క నామినేషన్స్ ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. అందులో ఎన్ని సినిమాలు నామినేషన్స్ ను దక్కించుకుంటాయి అనేది చూడాలి.
ఆస్కార్ అవార్డుల యొక్క నామినేషన్స్ ను ఈనెల 24న ప్రకటిస్తారు. ఆ నామినేషన్స్ ను దక్కించుకోవడం కూడా చాలా గొప్ప విషయం అన్నట్లుగా అంతా భావిస్తారు.
ఆస్కార్ నామినేషన్స్ ను సొంతం చేసుకున్న సినిమాలకు మార్చి 12వ తారీకున అవార్డులను ప్రధానం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలో మన ఆర్‌ఆర్ఆర్ పేరు వినిపించేనా అనేది జనవరి 24వ తారీకున క్లారిటీ రాబోతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.