మా ఆయన పెద్దగా మారలేదు

Update: 2015-12-05 07:30 GMT
పెళ్లం బెల్లం లాంటిందంటారు. పెళ్లి అనంత‌రం పెళ్లాం చెప్పినట్లు న‌డుచుకోవాల్సిందేన‌ని కొంత‌మంది అభిప్రాయం. రోజులు మారాయి వాటితో పాటు మ‌నం మారాలంటే ఒక‌రి అభిప్రాయాల‌ను ఒక‌రు గౌర‌వించుకుంటేనే క‌ల‌కాలం క‌లిసి ఉంటాం. లేదంటే నూరేళ్ల ధాంప‌త్య జీవితం నూరు రోజుల‌కే ప‌రిమితమ‌వుతోన్న రోజులివి. పెళ్లాం మాట మొగుడు వినాలి...మొగుడు మాట పెళ్లం వినాలి. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా జ‌రిగినే ఎవ‌రి వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను వాళ్లు కోరుకోవాల్సిందే. ఇటీవ‌ల ఓ సమావేశంలో క‌రీనాక‌పూర్ మాట్లాడిన విధానాన్ని బ‌ట్టి చూస్తే వీటిలో కొన్ని విష‌యాలు  ఎక్క‌డా పొల్లు కూడా పోన‌ట్లు క‌నిపిస్తుంది.
 
2012లో అమ్మ‌డు అప్ప‌టికే విడాకులు తీసుకున్న సైఫ్ అలీఖాన్ ను పెళ్లాడింది.  ప్ర‌స్తుతం వీళ్లిద్ద‌రూ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. ఈ మూడేళ్ల‌లో వీళ్లిద్ద‌రి మ‌ధ్య చిన్న పాటి స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తాలేదంటే క‌రీనా మ‌న‌స్త‌త్వం వలనేనని తెలుస్తోంది.  భ‌ర్త‌ను అలా ఉండాలి. ఇలా ఉండాల‌ని ఏ రోజు ఇబ్బింది పెట్ట‌లేదట‌.  సాధార‌ణంగా పెళ్లి త‌ర్వాత చాలా మార్పులు వ‌స్తాయి.  కానీ సైఫ్  లో అలాంటి మార్పులు  ఈ మూడేళ్ల‌లో ఎప్పుడూ చూడ‌లేదు. పెళ్లికి ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు.  నా కోసం ఎప్పుడు ఛేంజ్ అవ్వ‌మ‌ని కోర‌లేదు. భ‌విష్య‌త్తులో కూడా అలాంటి అవ‌స‌రం రాకుండా చూసుకుంటా అని తెలిపింది.

అలాగే న‌టిగా కెరీర్ ఎంతో హ్యాపీగా సాగిపోతుంది.  నాయిక‌ల్లో కంగ‌నా రనౌత  పెర్పార్ మెన్స్ సూప‌ర్బ్ గా ఉంటుంది. త‌ను వెడ్స్ మ‌ను చిత్రంలో ఆమె న‌ట‌న బాగుంటుంది. నేను ఇనిస్పిరేష‌న్ గా తీసుకునే నాయిక‌ల్లో ఆమె కూడా ఒక‌రు. కంన‌గ ఆన్ స్రీన్ పై ప్ర‌తీ స‌న్నివేశాన్ని అవ‌లీల‌గా చేసేస్తుంది. అందుకే ఆమెను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తాను అని చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News