కరోనా మహమ్మరి ఎఫెక్ట్ ఎక్కువగా పడిన రంగాలలో సినీరంగం ఒకటి. సినీ చరిత్రలో ఇండస్ట్రీ ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. గత నాలుగు నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతబడి ఉన్నాయి. సినిమా షూటింగులు ఆగిపోయాయి. దీంతో ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేక జీవనం సాగించడం కష్టంగా మారింది. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు షూటింగులకు అనుమతిస్తున్నా రోజురోజుకి కరోనా తీవ్రత ఎక్కవ అవుతుండటంతో రిస్క్ తీసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు సెప్టెంబర్ నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అది జరిగిలే కనిపించడం లేదు. అంతేకాకుండా కరోనాతో కొంతకాలం సహజీవనం చేయాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది. దీంతో టాలీవుడ్ లో సినిమాల షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే దాని మీద స్పష్టత రాలేదు.
ఇక థియేటర్స్ ఇప్పట్లో తెరిచేలా లేరు. చిత్ర పరిశ్రమ మూత పడడంతో నిర్మాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమాలను నిర్మించిన నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. చిన్న చిన్న సినిమాలు ఓటీటీ బాట పడుతున్నా పెద్ద సినిమాలు మాత్రం ముందుకు రావడం లేదు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు థియేటర్స్ లో బొమ్మ పడకపోవచ్చని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారట. దీనిని బట్టి చూస్తే 2020 మొత్తం కరోనా తోనే గడిచిపోనుందని తెలుస్తోంది. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ చేసి సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేసినా దీని ఎఫెక్ట్ మాత్రం ఇంకొన్నాలు కొనసాగనుందని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ క్రైసిస్ ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై వచ్చే ఏడాది చివరి వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.