తెలుగు ఆడియ‌న్స్ కోసం మ‌రో డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌

Update: 2020-09-30 06:30 GMT
టాలీవుడ్‌ లో ఇప్ప‌టికే `ఆహా` ఓటీటీ ప్లాట్ ఫామ్ వున్న విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో ఓటీటీ రాబోతోంది.  `పిలిమ్` పేరుతో కొత్త డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట‌ర్ కాబోతోంది. దీంతో స‌రికొత్త వినోదం అతి త‌క్కువ ధ‌ర‌లోనే అందుబాటు లోకి రానుంది. ఈ ఫిలిమ్ ఓటీటీ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ ‌లో సినిమాలు, .. వెబ్ సిరీస్‌ లు, .. ఇండిపెండెంట్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇత‌ర ఓటీటీల‌తో పోలిస్తే ఫిలిమ్ ఓటీటీ స‌బ్ స్క్రిప్ష‌న్ చార్జీలు త‌క్కువ‌గా వుంటాయ‌ని సంస్థ ప్ర‌తినిధులు చెబుతున్నారు. కొంత మంది యంగ్ ఇంట‌ర్ ప్రెన్యూర్స్ క‌లిసి ఫిలిమ్ ఓటీటీని తీసుకొస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి ఫెస్టివ‌ల్ ముందు ఈ ఓటీటీని లాంచ్ చేయ‌బోతున్నారు. ఇందులో విజ‌య్ సేతుప‌తి న‌టించిన `పిజ్జా 2`, మ‌మ్ముట్టి న‌టించిన `రంగూన్ రౌడీ`, ప్రియ‌మ‌ణి చేసిన `విస్మ‌య‌` వంటి అనేక ఇంట్రెస్టింగ్ మూవీస్, .. వెబ్ సిరీస్‌,.. ఇండిపెండెంట్ మూవీలు ప్రీమియ‌ర్ కానున్నాయి.

`ఫిలిమ్‌` ఓటీటీలో విజ‌య్ సేతుప‌తి న‌టించిన `పిజ్జా 2` తొలి చిత్రంగా ప్రీమియ‌ర్ కానుంది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు రంజిత్ జ‌య‌కోడి. గాయ‌త్రి క‌థానాయిక‌గా న‌టించింది. సోనియా దీప్తి.., మ‌హిమా నంబియార్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన `పిజ్జా 2` ఫిలిం ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు మంచి అనుభూతిని ఇవ్వ‌నుంది.
Tags:    

Similar News