ట్రెండీ టాక్‌: `వాటర్ బ్యూటీ` బిరుదాంకితురాలు

Update: 2021-05-06 04:36 GMT
ఇటు సౌత్ లో అటు నార్త్ లో సినిమా అవ‌కాశాలు త‌గ్గిన‌ప్ప‌టికీ ఇల్లి బేబి మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. నిరంత‌రం అండ‌ర్ వాట‌ర్ విన్యాసాల‌కు ఇల్లీ ఇస్తున్న ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ఇటీవల గోవా బ్యూటీ కాస్త వాట‌ర్ బ్యూటీగా మారిపోయింది. రెగ్యుల‌ర్ గా స్విమ్ వేర్ తో .. ఇన్న‌ర్ లుక్ తో పోస్టులు పెడుతూ త‌న ఫాలోవ‌ర్స్ ని టెంప్ట్ చేస్తూనే ఉంది.

దీంతో ఈ బ్యూటీకి తాజాగా `వాటర్ బ్యూటీ` అనే బిరుదుని ఇచ్చేశారు అభిమానులు. ప్ర‌స్తుతం బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్ లోనూ ఇదో హాట్ టాపిక్ గా మారిందంటే ఇల్లి బేబి వాట‌ర్ విన్యాసాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు..! తాజాగా ఇల్లి బేబి.. అభిషేక్ బ‌చ్చ‌న్ తో క‌లిసి బిగ్ బుల్ అనే సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఓటీటీలో చ‌క్క‌ని ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది ఈ వెబ్ సినిమా.

మ‌రోవైపు ఇలియానా అమెజాన్ ప్రైమ్ కోసం ఒక టాక్ షో చేయ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. టాక్ షో కోసం ఇలియానా భారీగా వసూలు చేస్తోంది. అమెజాన్ మొదటి సీజన్ ప్రతిస్పందనను బ‌ట్టి ప్రాజెక్లును కొనసాగించే ప్రణాళికలో ఉంది. ఇలియానాకు సౌత్ నుండి తగినంత అభిమానులు ఉన్నారు. ఉత్త‌రాదినా సుప‌రిచితం. ప్ర‌స్తుతం ఫిట్ లుక్ తో ఆక‌ర్షిస్తోంది. దేశవ్యాప్తంగా ఇలియానాకు సుపరిచితమైన ముఖం కావడంతో అమెజాన్ త‌న‌ని లాక్ చేసి భారీగా చెల్లిస్తోందిట‌. ప్రతిభావంతులైన దక్షిణ భారత దర్శకుడు ఈ టాక్ షోకు దర్శకత్వం వహిస్తారు. అమెజాన్ ఈ వివరాలను అధికారికంగా త్వరలో ప్రకటించనుంది.
Tags:    

Similar News