అన్నపూర్ణలో మరో కొత్త టెక్నాలజీ

Update: 2018-02-28 06:42 GMT
మనిషి జీవితంలో ఆనందం అనే అనుభవంలో  సినిమా కూడా ఒక బాగమైపోయింది. కాస్త బోర్ కొట్టినా ఈ రోజుల్లో ఎవ్వరైనా సరే సినిమాకి వెళ్లి ఒక సరికొత్త అనుబూతుని పొందాలని అనుకుంటారు. సినిమా వాళ్లు కూడా ఆడియెన్స్ కి నచ్చేలా అన్నిట్లో జాగ్రత్తలు తీసుకుంటారు. సినిమా కథ అలాగే దర్శకత్వం నటన వంటి విషయాలను పక్కనపెడితే సినిమా రిజల్ట్ లో ఇప్పుడు టెక్నాలిజి కూడా ఓ భాగమైంది.

గడిచిన పదేళ్లలో తెలుగు సినిమా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. హాలీవుడ్ టెక్నాలజీని సైతం మనవాళ్లు వాడేస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి లాంటి సినిమాకు రాజమౌళి మన స్టేట్ బార్డర్ దటకుండా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఇక్కడి స్టూడియోల లొనే కానిచ్చేశాడు. అన్నపూర్ణ. ప్రసాద్ ల్యాబ్. ఆర్.ఎఫ్‌.సి. రామానాయుడు స్టూడియోలు అన్ని టెక్నాలిజిలను అందుబాటులో ఉంచి దున్నేస్తున్నాయి. మెయిన్ గా ప్రసాద్స్ ల్యాబ్స్ అయితే అన్ని సినిమాలకు అందుబాటులో ఉంది. ఏ సినిమా అయినా ఇక్కడి స్టూడియోలో చిన్న వర్క్ చేసుకోని గాని బయటకు వెళ్ళలేదు.

అలాగే అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఇప్పుడు చాలా డేవలప్ అవుతోంది. ఇప్పటికే కొత్త టెక్నాలజీ అయిన డాల్బీ ఆట్మోస్ మిక్సింగ్ వంటివి అందుబాటులో ఉంచారు. ఇక 4కె బార్కో డిజిటల్ ఇంటర్మీడియట్ వంటివి కూడా వీళ్ళీ పెడితే.. అబ్బో దున్నేసుకుంటారుగా అని చెప్పవచ్చు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అన్ని అనువుగా ఇక్కడే కొనసాగేట్టు నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    

Similar News