ఏదైనా సినిమా హిట్టు కొడితే చాలు.. ఆ సినిమాని అన్నిరకాలా ఇతర ఫిలింమేకర్స్ ఉపయోగించుకోవడం అనాదిగా వస్తున్నదే. ఆ సినిమా లోని ఏదైనా క్యారెక్టర్ కి స్ఫూఫ్ చేయడమో, లేక ఆ సినిమా లో ఫేమస్ డైలాగ్ నో, ఫేమస్ లిరిక్ లోని లైన్ నో సినిమాలకు టైటిళ్లు గా పెట్టుకోవడమో చూస్తున్నదే. జనాల నోళ్లలో బాగా నాని పోయిన ఆ పదాల తో ప్రచారం సులువుగా సాగిపోతుండడమే అందుకు కారణం.
ఆ కోణంలోంచి చూస్తే జక్కన్న బాహుబలిని మన మేకర్స్ అన్నివాధాలా వాడేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి కే బోలెడన్ని స్ఫూఫ్ లు రెడీ అయిపోతున్నాయి. అంతేకాదు .. ఇందులో క్యారెక్టర్ల పేర్ల నే తమ సినిమాల కు టైటిళ్లు గా పెట్టేసుకుంటున్నారు. ఇప్పటికే ఫిలింఛాంబర్ లోనూ టైటిల్స్ రిజిష్టర్ అయిపోయాయి. భళ్లాల దేవ పేరు తో ఓ అనువాద చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. అంతేకాదు కొన్ని కార్పొరెట్ కంపెనీలు బాహుబలి పోస్టర్లని ఇమ్మిటేట్ చేస్తూ తమ ఉత్పత్తులకు ప్రచారం చేసేసుకుంటున్నాయి. చివరికి సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట కూడా బాహుబలి పోస్టర్‌కి ఇమ్మిటేషన్.
అంతేకాదు... బాహుబలి రికార్డుల్ని కొట్టాలంటే ఏం చేయాలి? అన్న పట్టుదల ఇతర హీరోల్లో మొదలైంది. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ ని బీటౌట్ చేయాలంటే ఏం చేయాలి? అన్న కసి పెరిగింది. భారీ పెట్టుబడులకు తెరలేచింది. ఇక ముందు ఈజోనర్ సినిమాలు వస్తాయి. మేకర్స్ లోనూ డేర్ పెరిగింది... ఇదో కొత్త ట్రెండ్. మంచి కోసం ట్రెండ్. అంతా మన మంచికే.