కొత్త హీరోయిన్లకు అవకాశం రావడమే చాలా కష్టం.. డెబ్యూ సినిమా హిట్ అయిన తర్వాత కూడా కొంతమంది హీరోయిన్లకు చెప్పుకోదగ్గ ఆఫర్లు రాని పరిస్థితి ఉంటుంది. అలాంటిది మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఇండస్ట్రీలో ఇతర ఫిలిం మేకర్ల నుండి ఎంక్వైరీలు రావడం.. ఆఫర్లు రావడం సాధారణ విషయం కాదు. కానీ 'గ్యాంగ్ లీడర్' లో నాని సరసన నటిస్తున్న ప్రియాంక మోహన్ కు మాత్రం ఇప్పుడు అలాంటి గుడ్ టైమ్ నడుస్తోందట.
చెన్నై బ్యూటీ అయిన ప్రియాంక ఆరుళ్ మోహన్ నాని సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే ఈ కొత్త బ్యూటీ గురించి యువ హీరోలు ఎంక్వైరీలు చేస్తున్నారని తమ కొత్త సినిమాల్లో ప్రియాంకను హీరోయిన్ గా తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే దర్శకుడు విక్రమ్ కుమార్ మాత్రం 'గ్యాంగ్ లీడర్' చిత్రం పూర్తయ్యే వరకూ మరో సినిమా చేయకూడదని అగ్రిమెంట్ చేయించుకున్నాడని కూడా టాక్ వినిపించింది. అయితే ఆ అగ్రిమెంట్ సంగతి ఏమైందో తెలియదు కానీ ప్రియాంక మోహన్ మొదటి సినిమా విడుదల కాకముందే రెండవ చిత్రానికి సైన్ చేసిందనే టాక్ వినిపిస్తోంది.
షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించే కిశోరుడు ఈమధ్య శర్వానంద్ కు ఒక మంచి కథ వినిపించాడట. శర్వాకు కథ నచ్చడంతో ఆ కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపాడట. ఈ సినిమాలోనే ప్రియాంక మోహన్ ను హీరోయిన్ గా తీసుకున్నారట. ఇలా మొదటి సినిమా రిలీజ్ కాకముందే నెక్స్ట్ సినిమా ఆఫర్ సాధించడం రేర్ గా జరుగుతుంది. గతంలో రష్మిక కు టాలీవుడ్ లో అలానే జరిగింది. తన టాలీవుడ్ డెబ్యూ ఫిలిం 'ఛలో' రిలీజ్ కాకముందే 'గీత గోవిందం' లో హీరోయిన్ ఆఫర్ సాధించి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇప్పుడు రష్మిక ఫీట్ ను ప్రియాంక రిపీట్ చేసినట్టే.