పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సినీ పరిశ్రమ మీద బాగానే ప్రభావం చూపించింది. ఇక్కడ జరిగే లావాదేవీలన్నింటికీ ఇది పెద్ద దెబ్బే. ఆ నిర్ణయం వచ్చిన వెంటనే కలెక్షన్ల మీదా ప్రభావం పడింది. థియేటర్లు వెలవెలబోయాయి. లాస్ట్ వీకెండ్లో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రానికి ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. ఐతే కలెక్షన్ల మాట ఎలా ఉన్నా కొత్త సినిమాలకు కొన్ని అడ్వాంటేజెస్ కూడా లేకపోలేదు. మామూలుగా అయితే సినిమాకు ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా అంతే సంగతులు. వీకెండ్ తర్వాత కలెక్షన్లలో మేజర్ డ్రాప్ కనిపిస్తుంది. అలాగే వారం తిరగ్గానే సినిమా అడ్రస్ గల్లంతైపోతుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ‘సాహసం..’ ఓపెనింగ్స్ తగ్గాయి కానీ.. వీకెండ్ తర్వాత కలెక్షన్లలో పెద్ద డ్రాప్ కనిపించలేదు. స్టడీగానే ఉన్నాయి.
ఈ సినిమాకు యావరేజ్ టాక్ ఉన్నప్పటికీ.. సినిమా ఇంకా థియేటర్లలో నిలిచే ఉంది. గౌతమ్ మీనన్ చెప్పినట్లు సినిమాకు రెండు మూడు వారాలు థియేటర్లలోనే ఉండబోతోంది. మామూలుగా అయితే వారానికి రెండు మూడు సినిమాలు థియేటర్లలోకి దిగేవి. కానీ ఇప్పుడు వారానికి ఒక్క సినిమానే వస్తుండటంతో థియేటర్ల సమస్య లేదు. దీంతో రెండో వారానికల్లా సినిమాను థియేటర్ల నుంచి లేపేసే పరిస్థితి లేదు. ‘సాహసం..’ సినిమాకు థియేటర్లు పెద్ద సంఖ్యలోనే ఇచ్చారు. ఈ వారం రాబోతున్న ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా భారీ స్థాయిలోనే రిలీజవుతోంది. ముందు అనుకున్న ప్రకారమైతే ఆ చిత్రం ఇంకో రెండు మూడు సినిమాలతో పోటీ పడాల్సింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సోలోగా రిలీజవుతోంది. ఎక్కువ థియేటర్లు దక్కాయి. అలాగే సినిమాకు ఓ మోస్తరు టాక్ వచ్చినా.. రెండు మూడు వారాలు థియేటర్లలో ఉంటుంది. కాబట్టి పెద్ద నోట్ల రద్దుతో ప్రతికూలతున్నా.. అడ్వాంటేజెస్ కూడా లేకపోలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/