బ‌డా నిర్మాత సౌత్ ని గ‌ట్టిగానే టార్గెట్ చేసాడే!

Update: 2022-03-25 14:30 GMT
ఏడాది ఆరంభంలోనే `హృద‌యం` అనే చిత్రం మ‌ల‌యాళీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. యువ‌త‌రం టార్గెట్ గా తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఒక యువకుడి జీవితంలోని వివిధ దశల్లో జరిగే ప్రయాణాన్ని ద‌ర్శ‌కుడు వినీత్ శ్రీనివాస‌న్ వెండితెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించారు. కంటెంట్ తో పాటు మ్యూజిక‌ల్ గానూ సినిమా పెద్ద విజ‌యం సాధించింది.

మల‌యాళంతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ సినిమా ఫేమ‌స్ అయింది. ఈ రొమాంటిక్ డ్రామాని అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ చేస్తే మ‌రాఠి సినిమా `సైర‌త్` లాంటి స‌క్సెస్ ని అందుకొవ‌చ్చని అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. అందుకే ఈ ఆఫ‌ర్ ని బాలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థ ద‌క్కించుకుంది. బాలీవుడ్ లో స‌క్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ‌గా దూసుకుపోతున్న ధర్మ ప్రొడ‌క్ష‌న్స్- ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమా తెలుగు..హిందీ..త‌మిళ హ‌క్కుల్ని చేజిక్కించుకుంది.

ఈ విష‌యాన్ని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత‌ కరణ్ జోహార్  ట్విట‌ర్ వేదిక‌గా రివీల్ చేసారు. మాతృకలో `హృద‌యం` చిత్రాన్ని మేరీల్యాండ్ సినిమాస్ పై విశాఖ్ సుబ్ర‌మ‌ణియ‌మ్ నిర్మించారు. ఇప్పుడీ ఏజ్ ల‌వ్ స్టోరీ మూడు భాష‌ల్లోనూ రీమేక్ కానుంది. మ‌రి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా ఎవ‌ర్ని ఎంపిక చేస్తారు?  కొత్త వాళ్ల‌ని తీసుకుంటారా?  మాతృక ద‌ర్శ‌కుడ్ని రంగంలోకి దించుతారా? అన్న‌ది చూడాలి.

ఇటీవ‌ల కాలంలో మ‌ల‌యాళం సినిమాలు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే విడుద‌లైన  `భీమ్లా నాయ‌క్`- మాలీవుడ్ సినిమా `అయ్య‌ప్పునం కోషియ‌మ్` కి రీమేక్ గా  తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. అలాగే మ‌రో మ‌ల‌యాళం చిత్రం  `లూసీఫ‌ర్ ని  మెగాస్టార్ చిరంజీవి `గాడ్ ఫాద‌ర్` టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. `బ్రోడాడి` అనే మ‌ల‌యాళం సినిమాలో కూడా చిరంజీవి రీమేక్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

ఆ ర‌కంగా మెగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రు మ‌ల‌యాళంలో కంటెంట్ లో వెలిగిపోతున్నారు. ఇక ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ `లైగ‌ర్` సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతుంది. పూరి కనెక్స్ట్ తో క‌లిసి ధ‌ర్మ   ప్రొడ‌క్ష‌న్స్ `లైగ‌ర్`  చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా `హృదయం` తెలుగు రీమేక్ రైట్స్ ని సైతం ధ‌ర్మ సంస్థ ద‌క్కించుకోవ‌డంతో సౌత్ లో క‌ర‌ణ్  పాగా వేయాల‌న్న ఆలోచ‌న క‌నిపిస్తుంది.
Tags:    

Similar News