మెగా వర్సెస్ నందమూరి! వార్ గురించి తెలిసినదే. హీరోల మధ్య ప్రత్యక్షమైన వార్ లేకపోయినా కానీ అభిమానుల్లో ఇది దశాబ్ధాల పాటు కొనసాగుతూనే ఉంది. 90లలో మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ నందమూరి బాలకృష్ణ వార్ కొనసాగింది. అప్పటి నుంచి అది సుస్థిరంగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఇందులో మార్పు వచ్చిందా? అంటే అవుననే జూనియర్ ఎన్టీఆర్ ధృవీకరించారు.
``ఇరు కుటుంబాల తారల మధ్య విరోధ సన్నివేశం ఉంది. కానీ చరణ్ .. నేను ఇప్పుడు ఉత్తమ స్నేహితులుగా ఉన్నాం కాబట్టి మొత్తం దృశ్యం మారిపోయింది`` అని జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. బాలకృష్ణ.. చిరంజీవిల కాలం నుంచి రెండు శిబిరాల మధ్య 30 ఏళ్లుగా కొనసాగుతున్న పోటీకి తెర దించేసినట్టేనని ఎన్టీఆర్ అన్నారు. ఇకపోతే ఈ ఇద్దరూ ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. అయితే ఎడిటింగ్ లో తారక్ కి సంబంధించిన చాలా సన్నివేశాలు కట్ అవ్వడంతో అతడు అసంతృప్తికి గురయ్యాడన్న గుసగుసలు వినిపించాయి. కానీ యునానిమస్ గా ఆర్.ఆర్.ఆర్ విజయం సాధించింది. ఇందులో చరణ్ తో పాటు తారక్ కూడా పెద్ద భాగం. కెప్టెన్ రాజమౌళి ఏది నిర్ధేశిస్తే అదే సత్యమవుతుందని అంగీకరించాలి.
ఎన్టీఆర్ నెక్ట్స్ ఏంటి?
యంగ్ యమ ఎన్టీఆర్ నటించే తదుపరి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. భారీ పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఇప్పుడు చాలా కాలంగా ఎన్టీఆర్ 30 గురించి అధికారిక అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ 30కి సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.
అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. కానీ ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం కోసం అనిరుధ్ నిజంగానే పని చేయాలని కోరుతున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియాను ఫాలో అవుతూ దీనికి అంగీకరించడం ఆసక్తికరం. ఎన్టీఆర్ తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన 30వ సినిమా కోసం అనిరుధ్ ను ఖాయం చేయాలని నా అభిమానులు సూచిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాలని వారు పట్టుబట్టారు.. అని తెలిపారు. నిజానికి అనిరుధ్ ఎనర్జిటిక్ బాణీలకు తారక్ డ్యాన్స్ చేస్తే అది ప్రత్యేకంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
అందుకే సోషల్ మీడియాలో తమ గళాన్ని వినిపిస్తున్నారు. లక్కీగా ఎన్టీఆర్ నిజంగానే అదే ఫాలో అవుతున్నాడు. ఇంకెంతో దూరంలో లేదు..ఎన్.టి.ఆర్ 30ని దర్శకుడు కొరటాల శివ తనదైన రీతిలో ప్రకటించే ఆలోచనలో ఉన్నాడని ఎన్టీఆర్ చెప్పారు. మొత్తానికి అభిమానుల కోరిక నెరవేర్చేందుకు తారక్ ముందుకు రావడం ఆసక్తికరం. అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్స్ ని అతడు పరిశీలిస్తున్నాడని అర్థం చేసుకోవాలి.