మెగా బ్రదర్ నాగబాబు ముక్కుసూటి మనిషి. ఏ విషయంపైనైనా ఓపెన్ గా మాట్లాడగల ధైర్యశాలి. మెగా ఫ్యామిలీని ఎవరైనా టార్గెట్ చేస్తే ముందుగా రంగంలోకి దిగేది మిడిలాయనే. సోషల్ మీడియాలో మహా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం వివాదాలు ఈయన చుట్టూ తిరుగుతుంటాయి. ఇక సరదా సంభాషణలోనూ నాగబాబు అందరితో కలివిడిగా కలిసిపోతారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ తో ముచ్చటిండం అంటే ఆయనకు ఎంతో సరదా. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు టచ్ లోకి వస్తుంటారు.
ఆ చనువుతోనే కుమార్తె నిహారిక పెళ్లి విషయంలో మీ సలహాలు..సూచనలు సైతం కావాలని నిహారిక పెళ్లికి ముందు కోరారు. నిహారికకి మంచి వరుడు ఉంటే చూడండని పబ్లిక్ గానే చెప్పారు. అల్లరి పిల్లని ఇంట్లో భరించడం కష్టంగా ఉంది. పెళ్లి చేసి పంపిచేస్తాను అని సరదాగా ఫ్యాన్స్ తో సంభాషణలో భాగంగా అన్నారు. చివరికి నిహారిక పెళ్లి మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు..అన్నయ్య చూసిన సంబంధాన్నే ఖాయం చేసి ముందుకెళ్లారు.
ప్రస్తుతం నిహారిక -చైతన్యల ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఆ మధ్య వేరు కాపురం కూడా పెట్టినట్లు రివీల్ చేసారు. ఇక మెగా బ్రదర్స్ ఫ్యామిలీలో పెళ్లికున్నది వరుణ్ తేజ్ ఒక్కడే. తాజాగా అభిమానులతో నాగబాబు చిట్ చాట్ లో భాగంగా ఓ నెటి జనుడు వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు సార్ అని అడిగాడు? దీనికి నేను కాదు..వరుణ్ తేజ్ సమాధానం ఇస్తాడని అన్నారు. అయితే గతంలో ఇదే ప్రశ్న నాగబాబు ముందుకు ఓ అభిమాని రూపంలో వెళ్లినప్పడు మరో రకమైన రిప్లై వచ్చింది.
మంచి అమ్మాయి ఉంటే చూడమని నాగబాబు కోరారు. దానికి ఆ నెటి జనుడు అలాగే సార్ అని అన్నాడు. అదే సందర్భంలో వరుణ్ ప్రేమ వివాహం చేసుకున్నా ఎలాంటి అభ్యంతరం లేదని కూడా నాగబాబు అన్నారు. మొత్తానికి పెళ్లి విషయంలో వరుణ్ కి నాగబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ `గని` సినిమాలో నటిస్తున్నాడు.
ఇందులో బాక్సర్ పాత్రలో అలరించనున్నాడు. అన్ని పనులు పూర్తిచేసుకున్న సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అనీల్ రావిపూడి దర్శకత్వంలో `ఎఫ్ -3`లోనూ నటిస్తున్నాడు. `ఎఫ్ -2`కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.