ఏ రంగంలో నష్టాలు వచ్చినా దాని తాలూకు వస్తువులు కళ్లకు కనిపిస్తూ ఉంటాయి. అవి అమ్మడం వలన కొంత నష్టాన్ని పూడ్చుకోవచ్చు. అదే ఒక సినిమా తీయడం వలన నష్టం వస్తే కళ్లకి ఏమీ కనిపించదు. సినిమా దారుణమైన ఫ్లాప్ కావడం వల్లనే నష్టాలు ఎక్కువగా వస్తుంటాయి గనుక, దానిని ఎవరూ కొనరు. అందువలన సినిమా రంగంలో పెట్టుబడి అనేది కొంతకాలం క్రితం వరకూ ప్రమాదకారిగానే కనిపిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు సినిమా రూపు రేఖలు మాత్రమే కాదు .. దాని బిజినెస్ వ్యవహారాలలోను మార్పులు వచ్చాయి.
ఒక సినిమాపోతే గతంలో మాదిరిగా ఆస్తులు అమ్ముకుని అప్పులు తీర్చవలసిన అవసరం ఇప్పుడు దాదాపు ఉండదు. ఎందుకంటే సినిమా అనేది సెట్స్ పై ఉండగానే ఓటీటీ సంస్థలు ఆ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నాయి.
ఆ పెట్టుబడికి తగిన విధంగానే డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇక శాటిలైట్ హక్కులు .. డబ్బింగ్ హక్కులు చేతిలో ఉంటాయి. అనువాదాలను వీలైతే థియేటర్లో వదలొచ్చు .. లేదంటే యూట్యూబ్ లో. ఇలా ఒక సినిమా తరువాత అండగా నిలిచే అంశాలు ఆశాకిరణాల్లా కనిపిస్తున్నాయి.
అందువలన ఇప్పుడు వివిధ రంగాలకు చెందిన సంస్థలు, సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టడానికి ఆసక్తిని చూపుతున్నాయి. అప్పటివరకూ ఇండస్ట్రీ పై అనుభవం .. అవగాహన ఉండవు గనుక, ఒంటరిగా ఈ రింగ్ లోకి దిగకుండా ఆల్రెడీ మంచి క్రేజ్ ఉన్న బ్యానర్లతో చేతులు కలుపుతున్నారు .. భాగస్వాములు అవుతున్నారు. అలా ఇప్పుడు మై హోమ్స్ వారు కూడా సినిమాల నిర్మాణంలో తమ జోరు చూపించే దిశగా ముందుకు వెళుతున్నారు. ఆల్రెడీ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్న హారిక అండ్ హాసిని, సితార బ్యానర్లతో ఈ సంస్థ చేతులు కలిపింది.
మై హోమ్ వారి నిర్మాణం భాగస్వామ్యంలో మొదటి సినిమాగా ధనుశ్ 'సార్' సినిమాను చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశ లో ఉంది. త్వరలో త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమాకి కూడా ఈ భాగస్వామ్యం కొనసాగుతుంది. ఇక ఈ సంస్థ పూరి కనెక్ట్స్ తోను చేతులు కలుపుతున్నట్టుగా తెలుస్తోంది.
పూరి సొంతబ్యానర్లో ఒకదానితో తరువాత ఒకటిగా సినిమాలు రూపొందుతున్నాయి. ఫైనాన్సులు .. వడ్డీల గొడవ లేకుండా ఇలా ఒక నమ్మకమైన సంస్థకి పావలా వాటా ఇవ్వడానికి పెద్ద బ్యానర్లు ఉత్సాహంగానే ఉన్నాయట. మొత్తం మీద మై హోమ్ సినిమా నిర్మాణ రంగంలో కూడా తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తోందన్న మాట.