తల అజిత్ కి 'విశ్వాసం' తర్వాత సరైన సక్సెస్ పడలేదు. ఈ సినిమా విడుదలై మూడేళ్లు అవుతుంది. ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా సక్సెస్ అవ్వలేదు. 'నెర్కోండ పార్వల'..ఇటీవలే రిలీజ్ అయిన 'వలిమై' సహా ఫలితాలు ఆశాజనకంగా రాలేదు. 'వేదాళం'..'వివేగం'..'విశ్వాసం' ఫుల్ స్వింగ్ లో ఉన్న తలని రెండు పరాజయాలు కాస్త వేగాన్ని తగ్గించాయి.
అయినా అజిత్ తగ్గేదేలే అంటూ మళ్లీ 'వలిమై' దర్శకుడు హెచ్. వినోథ్ తోనే మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా తన 61వ చిత్రాన్ని వినోద్ తోనే చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్నారు.
హీరో-విలన్ పాత్రలో అజిత్ కనిపించనున్నారు. ఇది పక్కా యాక్షన్ చిత్రం అని తెలుస్తోంది. ఈసారి మాత్రం మిస్ పైర్ అయ్యే అవకాశమే లేదని టీమ్ ధీమాగా ఉంది.
'వలిమై' లో దొర్లిన తప్పదాల్ని సరిద్దిదుకుని అన్ని లెక్కలు 61 తో సెట్ చేసేలా ఈ కాంబినేషన్ రెడీ అవుతుందని తెలుస్తోంది. 'వలిమై' కూడా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. కానీ సినిమాకి అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. రొటీన్ ఎంటర్ టైనర్ అనే విమర్శ వినిపించింది. ఇప్పుడు వాటిని ఓవర్ కమ్ చేస్తూ వినోధ్ 61వ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో అజిత్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. మరి విలన్ పాత్రకి రాణి ఉందా? లేదా? అన్నది తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. వినోథ్ 'సతురంగ వేట్టై 2' చిత్రానికి పనిచేస్తున్నారు.
ఈ సినిమాకి వినోథ్ రచన అందించారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 'సతురంగ వెట్టై' కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న చిత్రమిది. తొలి భాగానికి వినోథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక అజిత్ విరామంలో ఉన్నారు. ఖాళీ సమయాన్ని కుటుంబానేకి కేటాయించి సమయం గడుపుతున్నారు. వినోథ్ రెడీ అంటే? 61 పట్టాలెక్కడమే ఆలస్యం.