మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండేళ్ల విరామం తరువాత 'ఆచార్య'తో ప్రేక్షకుల ముందు కొచ్చారు. స్టార్ డైరెక్టర్ ట్రాక్ రికార్డ్, ఇందులో మెగా పవర్ స్టార్ కీలక పాత్రలో నటించడం వంటి కారణాలతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. బాస్ సినిమా ఓ రేంజ్ లో వుంటుందని ఊహల్లో తేలియాడారు. కానీ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడిని కూడా షాక్ కు గురిచేస్తూ 'ఆచార్య' నిరుత్సాహ పరిచింది. కోటి ఆశలతో థియేటర్లకు వచ్చిన ఫ్యాన్స్ కు భారీ షాకిస్తూ డిజాస్టర్ గా నిలిచింది.
పక్కాగా చెప్పాలంటే చిరు కెరీర్ లోనే ఎవరూ ఊహించిన స్థాయిలో పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ కారణంగా డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోయారు. కర్ణాటకకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా తను నష్టపోయానని, తనని ఆదుకోవాలంటూ చిరుకు లేఖ రాయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా ద్వారా బయ్యర్స్ 70 నుంచి 80 శాతం నష్టాలని చూశారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా వుంటే ఈ సినిమా ప్రభావం మాస్ మహారాజా రవితేజపై పడినట్టుగా తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అంగీకరిస్తూ దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా రవితేజ నాలుగు ప్రాజెక్ట్ లతో ప్రస్తుతం బిజీగా వున్నారు.
ఆయన తాజాగా మెగాస్టార్ చిత్రంలో కీలక గెస్ట్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. బాబి డైరెక్ట్ చేస్తున్నఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రవితేజ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. అతనికి జోడీగా కేథరిన్ ని కూడా ఇటీవలే ఫైనల్ చేశారట. వైజాగ్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగే ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని ఫైనల్ చేయబోతున్నారు. ఇప్పటికే రవితేజ ఈ మూవీ కోసం డేట్స్ ని కేటాయించే పనిలో వున్నారట. గెస్ట్ క్యారెక్టర్ కోసం 8 నుంచి 9 కోట్ల వరకు డిమాండ్ చేశారట మాస్ రాజా.
రవితేజ జోరు, చిరు క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ముందు ఈ మొత్తానికి ఓకే అన్నా తాజాగా 'ఆచార్య' ఫలితంతో పారితోషికం విషయంలో వెనక్కి తగ్గుతున్నారట. ఈ ప్రాజెక్ట్ ని రవితేజ అంగీకరించిందే చిరు కోసం అయితే అదే చిరు కోసం పారితోషికం తగ్గించుకోవాలని కోరుతున్నారట. మరి ఇందుకు మాస్ మహారాజా అంగీకరిస్తారా? మైత్రీ వారు కోరినట్టే తగ్గుతారా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.