రామ్ చరణ్ - ఉపాసన జంట ఇటీవలే పదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ ఎవరికి వారు కెరీర్ పరంగా బెస్ట్ అని నిరూపించుకునేందుకు తపిస్తున్నారు.
ఆ మేరకు ఇరువురిపైనా ఒత్తిడి ఉంది. కారణం ఏదైనా పదేళ్లలో కిడ్స్ లేకపోవడంపై అభిమానులు మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మీడియా ఈ జంటను చాలాసార్లు పిల్లలు గురించి ప్రశ్నించింది. ఇదే విషయాన్ని ఉపాసన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. తాను సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లలు పుడతారని కూడా ఉపాసన అన్నారు.
ఇటీవలే సద్గురుతో ఇంటరాక్షన్ లో పిల్లలను కనడం గురించి తన ఆలోచనలను బహిర్గతం చేశారు ఉపాసన. పిల్లల విషయంలో తన ఆలోచనలను వెల్లడిస్తూనే.. ప్రజలు దానికి ఎలా స్పందిస్తారో వెల్లడించింది. సద్గురు కూడా దాని గురించి మాట్లాడారు. అసలు పిల్లల్ని కనకపోవడం భూమికి మేలు అని కూడా ఆయన అన్నారు. అయితే ఆ సమయంలో ఉపాసన చేసిన వ్యాఖ్యలను కొన్నిటిని మీడియాలు తప్పుగా ప్రచురించాయి.
జనాభా నియంత్రణ కోసం పిల్లలు పుట్టకూడదని ఉపాసన నిర్ణయించుకున్నట్లు మీడియాలో కథనాలొచ్చాయి. ఇన్ స్టాగ్రామ్ లోని ఒక పేజీలో ఈ కథనం వెలువడింది. రామ్ చరణ్ కూడా పిల్లలను కనడానికి వ్యతిరేకం.. ఎందుకంటే సినిమాలతో అభిమానులను అలరించడం తన లక్ష్యం కాబట్టి దానికి దూరం కాలేడు! అన్న అర్థం వచ్చేలా ఇన్ స్టా కథనం ప్రచురితమైంది.
అయితే దీనిపై ఉపాసన క్లారిటీ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వార్తల స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేస్తూ ``ఓహ్.. ఇది నిజం కాదు. దయచేసి వీడియో మొత్తం చూడండి .. నా కాపీని చదవండి`` అని అన్నారు.
నిజానికి పెళ్లి తర్వాత చరణ్ కెరీర్ పరమైన ఒత్తిడులను ఎదుర్కొన్నారు. అప్పటికే చిరు వారసుడిగా అతడు ఠఫ్ కాంపిటీషన్ ని ఇండస్ట్రీలో ఫేస్ చేస్తున్నాడు. అదే క్రమంలో అతడు పూర్తిగా కెరీర్ పైనే ఫోకస్ చేసాడు. ఇక ఉపాసన సైతం అపోలో హెల్త్ మేనేజింగ్ డైరెక్టర్ గా బిజీగా ఉన్నారు. ఇక చరణ్ కెరీర్ కోసం ఉపాసన అన్నీ బ్యాకెండ్ లో ఉండి మరీ చక్కదిద్దుతున్నారన్న టాక్ కూడా ఉంది. ఇక ఈ జంట వ్యక్తిగత వ్యవహారాల్లో నెటిజనులు మరీ అతిగా స్పందించడం బయటపడుతోంది. దీనికి ఎప్పటికప్పుడు ఉపాసన సమాధానం ఇస్తూనే ఉన్నారు.