కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లలో వారానికి అర డజను సినిమాలు తమ లక్ ని టెస్ట్ చేసుకోడానికి వస్తున్నాయి. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఈ మూడు వారాల్లో మూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకాదరణ పొందాయి. 'తిమ్మరుసు' 'SR కళ్యాణమండపం' సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగా.. 'పాగల్' కూడా మంచి వసూళ్లతో నడుస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హోప్ కనిపిస్తుండటంతో రాబోయే మూడు నెలల్లో మరికొన్ని క్రేజీ మూవీస్ థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాల జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం!
ఈ శుక్రవారం ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. శ్రీ విష్ణు - మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'రాజ రాజ చోర' చిత్రాన్ని ఆగస్టు 19న విడుదల చేస్తున్నారు. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశ్వ ప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. అదే రోజున హాస్యనటుడు కమ్ హీరో సునీల్ కీలక పాత్ర పోషించిన 'కనబడుటలేదు' అనే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ని రిలీజ్ చేస్తున్నారు. బుల్లితెర బ్యూటీ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన 'క్రేజీ అంకుల్స్'.. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన 'బజార్ రౌడీ' చిత్రాలు కూడా ఈ వీకెండ్ లోనే థియేటర్లలో ప్రదర్శించబడనున్నాయి. వీటితో పాటుగా 'చేరువైనా దూరమైనా' అనే చిన్న సినిమా కూడా ఈ వారమే వస్తోంది.
ఆగస్టు 27న సుధీర్ బాబు - 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ''శ్రీదేవి సోడా సెంటర్'' చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలానే అక్కినేని హీరో సుశాంత్ నటించిన ''ఇచ్చట వాహనములు నిలుపరాదు'' కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సెప్టెంబర్ 3వ తేదీ కోసం ఇప్పటికైతే రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. సందీప్ కిషన్ 'గల్లీ రౌడీ' - అవసరాల శ్రీనివాస్ '101 జిల్లాల అందగాడు' చిత్రాలు ఒకే డేట్ కి వస్తున్నట్లు ప్రకటించాయి.
సెప్టెంబర్ రెండో వారం నాటికి పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం వస్తే గోపీచంద్ 'సీటీమార్' చిత్రాన్ని అదే నెల 10వ తారీఖున విడుదల చేసే అవకాశం ఉంది. అక్కినేని నాగచైతన్య - శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన ''లవ్ స్టోరీ'' చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అప్పుడు కుదరకపోతే సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రావొచ్చు. కంగనా రనౌత్ లీడ్ రోల్ లో తెరకెక్కిన జయలలిత బయోపిక్ ''తలైవి'' కూడా అదే టైంలో రానుందని టాక్.
'ప్రస్థానం' దేవకట్టా - సాయి తేజ్ కలయిలో వస్తున్న ''రిపబ్లిక్'' చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక దసరా కానుకగా అక్టోబర్ 13న వస్తున్నట్లు అనౌన్స్ చేసిన రాజమౌళి ''ఆర్ ఆర్ ఆర్''.. చెప్పిన సమయానికి వస్తుందో లేదో అనే డౌట్ ఉంది. ఒకవేళ ఆ స్లాట్ ఖాళీ అయితే మాత్రం చిరంజీవి - కొరటాల శివ కలసి చేస్తున్న ''ఆచార్య'' చిత్రాన్ని బరిలో దించే అవకాశం ఉంది. ఇదే క్రమంలో మరో వారం గ్యాప్ తో బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో రూపొందే ''అఖండ'' సినిమా రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అయితే పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమాలు అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకవేళ ఏదైనా విపత్తు వస్తే మాత్రం అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ని రీ షెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది.