ఫోటో స్టోరి: బుల్లితెర న‌టి వేషాల‌కు సెన్సార్ లేదా?

Update: 2020-12-10 04:25 GMT
నియా శ‌ర్మ .. బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. సోష‌ల్ మీడియాల్లో మెరుపులు మెరిపించే ఈ బ్యూటీకి యూత్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది. బుల్లితెర న‌టిగా మెరిపించిన ఈ హాట్ గాళ్  `ట్విస్టెడ్` అనే వెబ్ సిరీస్ ‌తో పాపుల‌ర్ అయింది. చెల‌రేగి మ‌రీ హాట్ గా న‌టించి ఆక‌ట్టుకునే నియా శ‌ర్మపై నెటిజ‌నులు అంతే ఇదిగా నోరు పారేసుకోవ‌డం రెగ్యుల‌ర్ గా చూసేదే.

క‌ల‌ర్స్ టీవీలో `ఫియ‌ర్ ఫాక్ట‌ర్‌: ఖ‌త్రోంకె ఖిలాడి-9` షోలో  నియా శ‌ర్మ త‌న ఎక్స్ ట్రా టాలెంట్ తో ఔరా అనిపించింది. బుల్లితెర హాట‌స్ట్ గాళ్ గా ఇప్ప‌టికే త‌న‌పై ఓ ముద్ర ఉంది. ఆ ఇమేజ్ ని కాపాడుకుంటూ నిరంత‌రం అందుకు ధీటైన ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తోంది.

సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్న నియా త‌న ఫిట్ నెస్ వీడియోల‌తో ఫ్యాన్స్ ని మెస్మ‌రైజ్ చేసింది. తాజాగా నియా షేర్ చేసిన బోల్డ్ ఫోటో నెటిజ‌నుల్లో దుమారం సృష్టిస్తోంది. ఈ ఫోటోకి కామెంట్లు అంతే ఇదిగా ప‌డిపోతున్నాయ్. మ‌రీ సెన్సార్ లేక‌పోతే అంతేగా అంతేగా! అంటూ వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయ్. మ‌రీ ఇంత‌గా రెచ్చిపోయి థైషోస్ చేస్తున్న నియా.. ప‌బ్లిసిటీ జిమ్మిక్కుల‌కు అవాక్క‌వుతున్నారంతా. ఆవిడేమైనా కిమ్ క‌ర్ధాషియ‌నా.. అంత‌గా చెల‌రేగుతోంది? అన్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అన్న‌ట్టు ఇలాంటి వేషాల‌కు సెన్సార్ ఎందుక‌ని లేదు?  స‌మాచార ప్ర‌సారాల శాఖ దృష్టికి ఇలాంటివి రాలేదంటారా?
Tags:    

Similar News