త‌మ ఏజ్ గ్యాప్ పై స్పందించిన హీరోయిన్ భ‌ర్త‌!

Update: 2020-02-28 03:30 GMT
వాళ్ల పెళ్లి అయిన ద‌గ్గ‌ర నుంచి ఏజ్ గ్యాప్ గురించి గ‌ట్టిగానే చ‌ర్చ జ‌రుగుతూ వ‌స్తోంది. అమెరిక‌న్ అయిన నిక్ జోన‌స్ ను ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకున్న‌ప్పుడు చాలా మంది వారి ఏజ్ గ్యాప్ ను ప్ర‌స్తావించి ఆశ్చ‌ర్య‌పోయారు. నిక్ క‌న్నా ఏకంగా ప‌దేళ్లు పెద్ద‌ది ప్రియాంక చోప్రా! ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన‌ప్ప‌టికీ.. నిక్ జోన‌స్ ఒక టీనేజ్ కుర్రాడు! పెళ్లి స‌మ‌యానికి నిక్ వ‌య‌సు 27 - ప్రియాంక వ‌య‌సు 37!

ఇలా ప‌దేళ్ల వ‌య‌సు గ్యాప్ గురించి అప్ప‌ట్లో తెగ చ‌ర్చ జ‌రిగింది. అయితే చాలా మంది సెల‌బ్రిటీలు త‌మ క‌న్నా వ‌య‌సులో పెద్ద‌దైన భార్య‌ను క‌లిగి ఉన్నారు. అయితే వారి ఏజ్ గ్యాప్ కూడా త‌క్కువే. వాళ్ల ఏజ్ గ్యాప్ లు ఏడాదో - రెండేళ్లో - మ‌హా అంటే ఏ నాలుగేళ్లో ఉంటుంది. అయితే ప్రియాంక‌-నిక్ ల ఏజ్ గ్యాప్ ఏకంగా ప‌దేళ్లు!

ఇక స‌గ‌టు భార‌తీయులకు అయితే అదో విడ్డూర‌మైన అంశంగా నిలిచింది. ఈ నేప‌థ్యంలో ఈ అంశం గురించి నిక్ జోన‌స్ స్పందించాడు. అదేం పెద్ద విష‌యం కాదు అని అంటున్నాడు నిక్. 'ఆమెకు 37 అనేది నిజ‌మే.. కూల్..' అంటూ తాపీగా స్పందించాడు నిక్. ఏజ్ గ్యాప్ పెద్ద‌గా చ‌ర్చ‌చేయాల్సిన  అంశం కాద‌ని, త‌మ వైవాహిక జీవితంలో అదో పెద్ద మ్యాట‌ర్ కాద‌ని తేల్చేశాడు. మొత్తానికి వ‌య‌సులో పెద్ద‌దైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌నే వారికి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్న‌ట్టుగా మాట్లాడాడు నిక్!



Tags:    

Similar News