నాగచైతన్యతో కలిసి 'సవ్యసాచి' చిత్రంలో నటించిన నిధి అగర్వాల్ ఆ వెంటనే తమ్ముడు అఖిల్ తో కలిసి 'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటించింది. బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకోలేక పోయినా కూడా నిధి అగర్వాల్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. మిస్టర్ మజ్ను విడుదలైందో లేదో వెంటనే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్'లో రామ్ కు జోడీగా ఎంపికయ్యింది. వచ్చే నెల నుండి ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.
మిస్టర్ మజ్ను చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నిధి అగర్వాల్ తన పెళ్లి ప్లాన్స్ - ఫ్యామిలీ మరియు సినీ కెరీర్ గురించిన పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. మిస్టర్ మజ్ను చిత్రంలోని హీరోయిన్ నిక్కీ పాత్రకు తన రియల్ లైఫ్ పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే నిక్కీ కోరుకున్నట్లుగా నేను కూడా పెళ్లి చేసుకోబోయే వాడు రాముడి వలే ఉండాలని కోరుకుంటున్నాను. రాముడు లాంటి వాడి కోసం నేను ఎదురు చూస్తున్నాను. సినిమాలో తరహాలో సైలెంట్ గా ఉండే రకం కాదని పేర్కొంది.
ఇక తాను హైదరాబాద్ లో పుట్టాను - మా అమ్మ తెలుగు. మా ఇంట్లో ఉన్న వారు - మా బంధువుల్లో సగానికి పైగా తెలుగు బాగా మాట్లాడుతారు. హైదరాబాద్ లో నాకు 500 మంది బందువులున్నారు. నేను తెలుగు బాగానే మాట్లాడతాను - నా ఫోన్ లో తెలుగు పాటలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మాకు సొంత ఇల్లు కూడా ఉంది. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి వాతావరణం మరియు బోజనం కూడా చాలా ఇష్టమని నిధి పేర్కొంది.
నేను చూసిన మొదటి తెలుగు సినిమా 'పోకిరి'. ఆ సినిమాను నేను ఎప్పుడు మర్చి పోలేను. అదొక గొప్ప సినిమా అనేది నా అభిప్రాయం. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన పూరి జగన్నాధ్ గారి దర్శకత్వంలో నటించబోతున్నందుకు నమ్మలేక పోతున్నాను. పూరి గారి సినిమాలో ఆఫర్ రాగానే కాదనకుండా ఓకే చెప్పాను. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లోని నా పాత్రలు చాలా విభిన్నంగా ఉన్నాయి.
ఇస్మార్ట్ శంకర్ లో నేను చేయబోతున్న పాత్ర కూడా చాలా భిన్నంగా ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా నా పాత్ర గురించి ఆలోచిస్తూనే ఉంటారు. తప్పకుండా నా కెరీర్ కు ఇస్మార్ట్ శంకర్ పాత్ర మరింత బూస్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను. పూరి గారి మూవీ కాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏది ఫైనల్ అవ్వలేదని నిధి చెప్పుకొచ్చింది.